📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Today News : Certificates – సదరం సర్టిఫికెట్ల పునఃపరిశీలన : అనర్హులను తొలగించేందుకే – మంత్రి పార్ధసారధి

Author Icon By Shravan
Updated: August 21, 2025 • 10:34 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సచివాలయం : బోగస్ సదరం సర్టిఫికేట్లతో (Certificates) దివ్యాంగుల ఫించన్లను పొందే అనర్హులను ఏరివేసేందుకే సదరం సర్టిఫికెట్ల పున:పరిశీలన కార్యక్రమం జరుగు తుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహనిర్మాణ శాఖమంత్రి కొలుసు పార్ధసారధి స్పష్టం చేశారు. గతంలో ఉన్న అర్హతలను బట్టే సర్టిఫికేట్ల పున: పరిశీలన జరుగుతుందని, అర్హతలను మారి ఏ ఫించనుదారులకు అన్యాయం చేసే విధంగా కూటమి ప్రభుత్వం ఏ మాత్రం ప్రవర్తించడం లేదని ఆయన తెలిపారు. బుధవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభా గంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా ఫించను పథకం క్రింద దివ్యాంగులకు ప్రభుత్వం ఇచ్చే రూ.6000ల ఫించన్ గత ప్రభుత్వం హాయంలో అనర్హులకు కూడా మంజూరు చేసి దుర్వినియోగం చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో మొత్తం 7.86 లక్షల మంది దివ్యాంగ ఫించన్లు పొందడం జరుగుతుందని, వారిలో 5.10లక్షల మందికి చెందిన సదరం సర్టిఫికేట్లను పునఃపరి శీలించేందుకు నోటీసులు (Notices) జారీ చేయడం జరిగిందన్నారు. అయితే ఇప్పటివరకు 4.50 లక్షల మంది వారి సర్టిఫికేట్లు తనిఖీ చేయించుకోగా వారిలో దాదాపు ఒక లక్ష మంది అనరులు ఉన్నట్లు గుర్తించడమైందన్నారు. అదే విధంగా మిగిలిన వారు తమ సర్టిఫికేట్లు రీవెరిఫై చేయించుకునేందుకు ముందుకు రాలేదన్నారు. వీరందరికి మరోసారి నోటీసులు జారీ చేస్తామని, అప్పటికీ వారు ముందుకు రాకపోతే వారి ఫించన్లు నిలుపుదల చేస్తామని తెలిపారు.

అయితే వైద్యులు ఎవర్నిఅయితే అనర్హులుగా దృవీకరించారో వారు మరోసారి తమ ఆర్జీని మండలాభివృద్ధి అధికారికిగాని, మున్సి పల్ కమీషనరు గాని అందజేసినట్లయితే మరోసారి వారి అర్హతను పరిశీలించడం జరుగు తుందన్నారు. అన్ని జిల్లాల్లో సదరం సర్టిఫికేట్ల రీవెరిఫికేషన్ జరిగిందని, అయితే అత్యధికంగా పులివెందులలోనే 1708 మంది బోగస్ ఫించను దారులు ఉన్నట్లు గుర్తించడమైందన్నారు. అదే విధంగా మచిలీపట్నంలో 1539 మంది, చంద్రగిరిలో 1604 మంది బోగస్ ఫించను దారులను గుర్తించడమైందన్నారు. అదేవిధంగా అత్యల్పంగా కాకినాడలో 19మంది, విశాఖ దక్షిణ నియోజకవర్గంలో 39మంది మరియు తాడికొండలో 55మంది బోగస్ ఫించను దారులను గుర్తించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం రూ.3వేలు ఫించను ఇస్తానని హామీ ఘోరంగా మోసం చేయడం జరిగిందని, అయితే తమ ప్రభుత్వం రూ.3వేల నుండి రూ.4వేలకు పెంచడమే కాకుండా అధికారంలోనికి వచ్చే మూడు మాసాల ముందు నుండే పెంచిన ఫించను ఎరియర్స్ ను కూడా ఫించనుదారులకు చెల్లించడం జరిగిందన్నారు.

దివ్యాంగులకు పెన్షన్, అమరావతి వరద నివారణపై మంత్రి

తమ కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు రూ.6వేలు, మంచంమీద నుండి లేవలేని అంగవికలురకు రూ.15వేలు, దీర్ఘకాలిక వా వ్యాధిగ్రస్తులకు రూ.10వేలు ఫించన్ తమ ప్రభుత్వం అందజేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఇమేజ్ను డ్యామేజ్ చేసే విధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ విషం చిమ్మడం ఎంతో దురదృష్టకరమన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిపై గత ప్రభుత్వానికి ఉన్న ద్వేషంతో ఎటువంటి అభివృద్ధి పనులు నిర్వహించక పోవడం వల్లే నేడు రాజధాని ప్రాంతం ముంపుకు గురవ్వడానికి కారణ మన్నారు. రాజధాని ప్రాంతంలో భవిష్యత్తులో జరిగే నిర్మాణాలు, కట్టడాలు ఏ మాత్రం వరద నీటికి గురవ్వకుండా ఉండేందుకు అవసరమైన వరద నీటి పారుదల వ్యవస్థలను ప్రభుత్వం ప్రణాళికా బద్దంగా నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/brahmotsavam-special-arrangements-for-the-convenience-of-devotees/andhra-pradesh/533496/

Andhra Pradesh Government News Breaking News in Telugu Certificates Review 2025 Disabled Pension Certificates Latest News in Telugu Minister Kolusu Parthasarathy Telugu News Paper

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.