Research: కేంద్ర బడ్జెట్లో గ్రహాంతర పరిశోధనలకు పెద్దపీట

Read Time:  1 min
Research
Research
FONT SIZE
GET APP

భారతదేశాన్ని అంతరిక్ష అగ్రగామిగా నిలబెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం 2026-2027 బడ్జెట్లో కీలక నిర్ణ యాలు తీసుకుంది. అంతరిక్ష విభాగం కోసం భారీగా నిధులను కేటాయించడమే కాకుండా, సాంకేతిక అభివృద్ధి,గ్రహాం తర పరిశోధనలకు ప్రాధాన్యతనిస్తూ భవిష్యత్తు ప్రణాళిక లను సిద్ధం చేసింది. ఈ ఏడాది బడ్జెట్లో అంతరిక్ష విభా గానికి 13,705.63 కోట్లను కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 2.16 శాతం పెరుగుదలగా
కనిపిస్తున్నప్పటికీ, సవరించిన వ్యయ అంచనాలతో పోల్చి చూస్తే దాదాపు 10.1శాతం పెరుగుదలను నమోదు చేయ డం విశేషం. ఇది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టబోయే ప్రతిష్టాత్మక మిషన్లకు కొత్తఉత్తేజాన్ని ఇస్తోంది. ఈ బడ్జెట్లో అత్యంత ఆసక్తికరమైన అంశం మూలధన వ్యయం. హార్డ్వేర్ తయారీ, కొత్త మిషన్ల అభివృద్ధి కోసం మూలధన వ్యయాన్ని గత ఏడాదితో పోలిస్తే 20 శాతం మేర పెంచారు. దీనివల్ల అత్యాధునిక ఉపగ్రహాల తయారీ, శక్తివంతమైన రాకెట్ ఇంజిన్ల అభివృద్ధి, ప్రయోగ కేంద్రాల ఆధునీకరణ వేగవంతం కానుంది. చంద్రుడిపైకి మనుషుల ను పంపే గగన్యాన్ వంటి భారీప్రాజక్టులతో పాటు, ఇతర గ్రహాలపై పరిశోధనలు (Research)చేసే ప్లానెటరీ సైన్స్ విభాగానికి ఈ నిధులు వెన్నుదన్నుగా నిలవనున్నాయి. సాంకేతికతనుస్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయడంద్వారా అంతర్జాతీయ అంత రిక్ష వాణిజ్యంలో భారత వాటాను పెంచుకోవాలని లక్ష్యం గా పెట్టుకుంది. అయితే, నిధుల వినియోగం విషయంలో కొన్నిసవాళ్లు కూడా కనిపిస్తున్నాయి.

Read Also : http://Nepal-India: ప్రారంభమైన ఇరు దేశాల మధ్య డైరెక్ట్ బస్సు

Research
Research

ప్రస్తుత ఆర్థిక సంవత్స రంలో అంతరిక్ష విభాగం తనకు కేటాయించిన నిధులను పూర్తిగా వినియోగించుకోలేక పోయింది. దాదాపు రూ.970 కోట్ల నిధులు నిరుపయోగంగా మిగిలిపోవడంపై ఆర్థిక నిపుణులు చర్చలు జరుపుతున్నారు. ప్రభుత్వం నిధులను పెంచుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రాజెక్టుల అమలులో ఎదు రయ్యే సాంకేతిక లేదా పరిపాలనాపరమైన జాప్యాల వల్ల ఈ పరిస్థితి తలెత్తుతోంది. భవిష్యత్తులో కేటాయించిన నిధులను నిర్ణీత కాలంలో వినియోగించుకోవడం ద్వారా మాత్ర మే దేశం ఆశించిన లక్ష్యాలను చేరుకోగలదు. ఈ లోటును భర్తీచేస్తూ రాబోయే కాలంలో మరింత వేగంగా ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. గ్రహాంతర పరిశోధనల రంగంలో భారత్ తన పరిధిని విస్తరిస్తోంది. చంద్రయాన్విజయాల తర్వాత, అంగారకుడు, శుక్రుడిపైకి చేపట్టబోయే పరిశోధనలకు ఈ బడ్జెట్లో ప్రాధాన్యత లభించింది. గ్రహాల పుట్టుక, అక్కడి వాతావరణ పరిస్థితులు, జీవరాశి ఉనికిపై లోతైన అధ్యయనాలు చేయడానికి అత్యాధునిక పరికరాల తయారీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది కేవలం పరిశోధనల (Research)కే పరిమితం కాకుండా, భవిష్యత్తులో అంతరిక్ష ఆధారిత వన రుల అన్వేషణకు కూడా పునాది వేయనుంది. యువశాస్త్రవేత్త లలో అంతరిక్ష విజ్ఞానంపట్ల ఆసక్తిని పెంచేందుకు ప్రభుత్వ తీసుకుంటున్న ఈ చర్యలు ఎంతో తోడ్పడతాయి.
-సి.హెచ్.ప్రతాప్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.