📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Centenary : నేడు మండలి శతజయంతి స్మృతి సంచిక ఆవిష్కరణ : చంద్రబాబు నాయుడు

Author Icon By Shravan
Updated: August 4, 2025 • 11:13 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : తెలుగునాట మాతృభాషోధ్యమాన్ని ఉదృతం చేసిన అక్షరయోధుడు మండలి వెంకట కృష్ణా రావు, దివి సీమ ఉప్పెన సమయంలో ప్రాణాలకు తెగించి సేవలను అందించిన మహానీయుడు. గాంధీజీ బాటలో శుద్ధఅహింసా వాదిగా జీవిత పర్యాంతం నిబద్ధతతో నిలిచిన నాయకుడు. ఆయన శతజయంతి సోమవారం జరుగుతుంది. ఈ నెల 4వ తేదీ ఉదయం అవనిగడ్డ గాంధీక్షేత్రంలో మండలి వెంకట కృష్ణారావు శతజయంతి ఉత్సవాల ప్రారంభ సభ జరుగుతుంది. ఇది ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటలకు విజయ వాడ తుమ్మలపల్లి (Tummalapalle) వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండలి వెంకట కృష్ణారావు స్మతి సంచికను లైట్ ఆఫ్ ది స్ట్రోమ్ను ఆవిష్కరిస్తారు. 1926 ఆగస్టు 4న కృష్ణా జిల్లా కైకలూరు తాలూకా, పల్లెవాడ గ్రామంలో మండలి వేంకట కృష్ణారావు దివిసీమ గాంధీగా ప్రజల మన్ననలనందుకున్నారు. 1997 సెప్టెంబర్ 27న తుదిశ్వాస విడిచారు. ‘బాధలలో ఉన్న వారిని మనమే ముందు వెల్లి ఓదార్చాలని’ వారు ఆచరించి చెప్పిన మాటలు దివిసీమ ప్రజలకు భగవద్గీతలా వినిపిస్తూనే ఉంటాయి. మండలి వేంకట కృష్ణారావు కృషి వల్లే దివిసీమలోని నిరుపేదలకు బంజరు భూములను పంచె కార్యక్రమం 1955లో ప్రారంభమైంది. 15 వేల ఎకరాల బంజరు భూములను పేదలకు పంచారు. 1974 లో ఆయన విద్యా సాంస్కృతిక వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 1975 రాక్షసనామ సంవత్సరం ఉగాదినాడు ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలను హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమ నిర్వహణ కమిటీకి మండలి వెంకట కృష్ణారావు కార్య నిర్వాహక అధ్యక్షునిగా వ్యవహరించారు. తాము ఈ రెండు అంతర్జాతీయ తెలుగు కేంద్రం పేరును ‘మండలి వెంకట కృష్ణారావు అంత ర్జాతీయ తెలుగు కేంద్రం’గా మార్చారు. వెంకట కృష్ణారావు బాటలోనే ఆయన కుమారుడు పూర్వపు అధికార భాషా సంఘం అధ్యక్షుడు, మాజీమంత్రి, ఇప్పటి జనసేన ఎంఎల్ఎ మండలి బుద్ద ప్రసాద్ తెలుగు భాషకు సేవలందిస్తు న్నారు. దగ్గర, దగ్గర అయిదు ప్రపంచ తెలుగు మహా సభల నిర్వాహణలో ఆయన కీలక భూమికను పోషించారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/high-court-cases-of-non-notified-stations-are-invalid/andhra-pradesh/525425/

Breaking News in Telugu Centenary Celebrations Latest News in Telugu Mandali Centenary 2025 Telugu News Paper Telugu politics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.