📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News Telugu: CCI Rules: పత్తి రైతులను పరేషాన్ చేస్తున్న సిసిఐ రూల్స్

Author Icon By Rajitha
Updated: November 25, 2025 • 12:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: రాజభవన్ లో గవర్నర్ జిష్ణుదేవవర్మతో రైతు కమిషన్ బృందం భేటీ సిసిఐ కొత్తగా పత్తి రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి అమలు చేస్తున్న విధానాలు రైతును రక్షించకపోగా మరింత సమస్యలలోకి తీసుకెళ్ళుతోందని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఆవేదన చెందారు. సోమవారం రాష్ట్రంలో పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు గవర్నర్ దృష్టికి కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, సభ్యులు కేవీఎన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, రాములు నాయక్, భవానీ రెడ్డి, భూమి సునీల్ తీసుకెళ్లారు. రాష్ట్రంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా తెరిచిందని, అంతేకాదు పత్తి రైతులు పత్తి (cutton) అమ్ముకోవాలన్నా కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన కపాస్ కిసాన్ యాప్ లో నమోదు చేసుకోవాలని నిబంధన పెట్టడంతో అమాయక రైతులు ఇబ్బందులు పడ్తున్నారని ఆవేదన చెందారు. దానికి తోడు ఎకరాకు క్వింటాళ్ల పత్తి మాత్రమేననే కండిషన్ కూడా రైతుకు తలనొప్పిగా మారిందని గవర్నర్ కు కమిషన్ వివరించింది.

Read also: HYD: టెట్ కు 1,26,085 దరఖాస్తులు 29 తుది గడువు..

CCI Rules: CCI rules are troubling cotton farmers

2025 పై అభ్యంతరాలు వున్నాయన్నారు

ఈసారి రాష్ట్రంలో 48 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. అధిక వర్షాలు, మొంథా తుఫాన్ వల్ల పత్తి రైతులు తీవ్ర నష్టపోయారు. తుఫాన్ ను ఎదుర్కొని సాగుచేసిన పత్తి రైతుకు సీసీఐ నిబంధనలు పరేషాన్ చేస్తున్నాయని కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గవర్నర్ కు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుండి కమిషన్ కార్యాలయానికి ఫిర్యాదులు వస్తున్నాయని.. రైతుల విన్నపాన్ని కమిషన్ బృందం.. తమరి దృష్టికి తీసుకొస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా కేంద్రం విడుదల చేసిన విత్తన చట్టం ముసాయిదా 2025 పై అభ్యంతరాలు వున్నాయన్నారు. ఇప్పటికే రాష్ట్ర రైతాంగం, రైతు సంఘాల నేతలు.. కేంద్ర విత్తన చట్ట ముసాయిదా 2025 పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్లు గవర్నర్ దృష్టికి కమిషన్ తీసుకెళ్లింది. పత్తి రైతుల విషయంలో కమిషన్ ఇచ్చిన వినతిపత్రానికి గవర్నర్ సానుకూలంగా స్పందించారు. సీసీఐ విషయంలో కేంద్రంతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. చట్టం ముసాయిదా విషయంలో వివరాలతో మరోసారి కలవాలని గవర్నర్ కోరినట్లు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తెలిపారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

CCI-Issues Cotton-Farmers Kapas-Kisan-App latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.