గుంతకల్లు రైల్వే : కేంద్ర అవినీతి నిరోధక సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) తెలుగు రాష్ట్రాలతో ప్రమేయం ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులో తీసుకుని విజయవాడలోని సిబిఐ కోర్టులో హాజరు పరిచింది. విశాఖపట్నం సిబిఐ ఏసిబికి విశ్వసనీయ వర్గాల ద్వారా అందించిన సమాచారం మేరకు సిబిఐ ప్రత్యేక బృందం విజయవాడ డివిజనల్ ఆసుపత్రిలో ఆఫీస్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న హస్మత్ అలీ, దక్షిణ మద్య రైల్వే విజయవాడ డివిజన్లో సీనియర్ పాసింజర్ ట్రైన్ మేనేజర్ (Guard) గా పనిచేస్తన్న శివనాగ ప్రసాద్లతో పాటు మరో ప్రైవేటు వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. తనను మెడికల్ డీ-క్యాటగిరైజ్డ్ చేసేందుకు లక్ష రూపాయలు, ముందుగా కుదుర్చుకున్న ఒప్పందంప్రకారం ముందుగా రూ.90వేలు నగదు, మరో రూ.10వేలను ఫోన్పే ద్వారా పంపాడు. ఈ సమయంలో నింధితులతోపాటు ఇద్దరుకూడా ఆర్థోడాక్టర్ శ్రీనివాస సత్యనారాయణతో సికింద్రాబాద్లోని రైల్వే సెంట్రల్ ఆసుపత్రి రూం. నెం.7లో విచారించారు. మెడికల్ డీ-క్యాటగిరైజేషన్ నిమిత్తం ఇద్దరు కూడా డాక్టర్ శ్రీనివాస సత్యనారాయణపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు అభిజు వర్గాల సమాచారం. ఈ వ్యవహారానికి హస్మత్అ బావమరిది షేక్ రసూల్ (ప్రైవేటు వ్యక్తి) ఇతను రైల్వేడాక్టర్లకు, రైల్వే ఉద్యోగులకు మద్య సిక్నెస్, అన్ఫిట్, డీ-క్యాటగిరైజేషన్ వంటి లావాదేవీల వ్యాపాకాలకు మద్యవర్తిగా వ్యవ హరిస్తున్నట్లు సిబిఐ వర్గాలు తెలిపాయి.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :