📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Pinnelli Brothers : పిన్నెల్లి సోదరులపై కేసు నమోదు

Author Icon By Sudheer
Updated: May 26, 2025 • 6:02 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో జరిగిన గుండ్లపాడు జంట హత్యల ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishnareddy), ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి(Pinnelli Venkataramreddy)లను పోలీసులు నిందితుల జాబితాలో చేర్చారు. 30 సెక్షన్ కింద నమోదైన కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆరో నిందితుడిగా (A6), వెంకటరామిరెడ్డిని ఏడో నిందితుడిగా (A7) పేర్కొన్నారు. ప్రధాన నిందితులు జవిశెట్టి శ్రీను (A1), తోట వెంకటరావు (A2), తోట గురువయ్య (A3), నాగరాజు (A4), తోట వెంకటేశ్వర్లు (A5)లుగా పోలీసులు గుర్తించారు.

టీడీపీ కార్యకర్తలపై దారుణ హత్య

వెల్దుర్తి మండలం బోదలవీడు వద్ద గుండ్లపాడుకు చెందిన టీడీపీ కార్యకర్తలు కోటేశ్వరరావు, వెంకటేశ్వర్లును ప్రత్యర్థులు పిరికిపంది దాడిలో హతమార్చారు. తెలంగాణలో వివాహానికి వెళ్లిన అనంతరం బైకు మీద తిరిగి వస్తున్న సమయంలో, స్కార్పియో వాహనంతో ఢీకొట్టి వారిని కిందికి ఈడ్చుతూ తీసుకెళ్లి రాళ్లతో మోది హత్య చేశారు. నిందితులు హత్య అనంతరం వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యారు. ఈ దుర్మార్గానికి సంబంధించిన దృశ్యాలు తీవ్ర ఆవేదన కలిగించాయి.

పోలీసుల వైఫల్యంపై ఎమ్మెల్యే జూలకంటి ఆగ్రహం

ఈ హత్యలపై మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాచర్లలో పోలీసులు పూర్తిగా వైసీపీ తొత్తులుగా మారారని విమర్శించారు. గుండ్లపాడులో చోటుచేసుకున్న హత్యలు పోలీసు వ్యవస్థపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయని పేర్కొన్నారు. మాచర్ల నియోజకవర్గంలో పోలీసు శాఖలో ప్రక్షాళన అవసరమని డిమాండ్ చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గ్రామాల్లో ఉద్రిక్తతలు పెంచుతున్నారని ఆరోపించారు. మృతుల కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుందని, న్యాయం కోసం పోరాడతామని హామీ ఇచ్చారు.

Read Also : Theaters Bandh: థియేటర్ల బంద్ నాకు సంబంధం లేదు – ద్వారంపూడి

case file Pinnelli Brothers Pinnelli Ramakrishnareddy Pinnelli Venkataramreddy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.