కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన వేమూరి కావేరి బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని కుదిపేసింది. ఈ ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోవడంతో అనేక కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. అయితే ఈ ఘటన అనంతరం సోషల్ మీడియా వేదికల్లో దుష్ప్రచారం జరుగుతోందని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కర్నూలు పోలీసులు వైసీపీ అధికార ప్రతినిధి, ప్రముఖ యాంకర్ శ్యామల (Anchor Shyamala) పై కేసు నమోదు చేశారు.
Read Also: CM Chandrababu: కొలికపూడి, కేశినేని చిన్ని వివాదంపై చంద్రబాబు తీవ్ర అసహనం
కర్నూలు బస్సు ప్రమాదానికి (Kurnool bus accident).. కల్తీ మద్యం, బెల్టు షాపులు కారణమని వైసీపీ ఆరోపణలు చేసింది. అయితే ఇవి తప్పుడు ఆరోపణలని ప్రభుత్వం చెప్తోంది.ఈ క్రమంలోనే కర్నూలు బస్సు ప్రమాదంపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ.. కర్నూలు మండలంసోని బి. తాండ్రపాడుకు చెందిన వెనుములయ్య అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా 27 మందిపై కర్నూలు పోలీసులు కేసు నమోదు చేశారు. యాంకర్ శ్యామల (ఆరే శ్యామల), కందుకూరి గోపీకృష్ణ, సీవీ రెడ్డితోపాటు వైసీపీ అధికారిక ఎక్స్ పేజీ నిర్వాహకులు ఉన్నారు.పోలీసుల దర్యాప్తు వాస్తవాలు ఇలా ఉండగా, దీనిని ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరిస్తూ కల్తీ మద్యానికి ముడిపెట్టి ప్రచారం చేశారన్న ఫిర్యాదు మేరకు పోలీసులు తాజాగా యాంకర్ శ్యామల, తదితర వైసీపీ నేతలపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: