📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: CAG Report – రాష్ట్రాలు తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి: కాగ్

Author Icon By Anusha
Updated: September 21, 2025 • 9:48 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై కాగ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. Comptroller and Auditor General (CAG) తాజా నివేదిక వెల్లడించింది. గత దశాబ్ద కాలంలో రాష్ట్రాల అప్పులు దాదాపు మూడింతలుగా పెరిగి, బడ్జెట్ నిర్వహణపై తీవ్రమైన ఒత్తిడి ఏర్పడిందని CAG హెచ్చరించింది. ఈ నివేదిక దేశవ్యాప్తంగా ఆర్థిక నిపుణులు, మీడియా, రాజకీయ వర్గాల చర్చకు కేంద్రంగా మారింది.CAG అధిపతి కె. సంజయ్ మూర్తి రాష్ట్రాల ఆర్థిక కార్యదర్శుల సమావేశంలో ఈ నివేదికను విడుదల చేశారు.

ఇందులో 2013-14 ఆర్థిక సంవత్సరంలో 28 రాష్ట్రాల మొత్తం అప్పులు రూ.17.57 లక్షల కోట్లుగా ఉండగా, 2022-23 నాటికి ఇవి రూ.59.60 లక్షల కోట్లుకు చేరినట్లు వెల్లడించారు. పదేళ్లలోనైనా రాష్ట్రాల అప్పుల పెరుగుదల 3.3 రెట్లుకు చేరిందని నివేదిక స్పష్టంగా పేర్కొంది. దీంతో రాష్ట్రాల బడ్జెట్‌ (State Budget) లో సింహభాగం వడ్డీలు, రుణాల చెల్లింపులకే సరిపోతోందని పేర్కొంది.తీసుకున్న అప్పులను ఆస్తుల కల్పనకు, పెట్టుబడులకు కాకుండా రోజువారీ రెవెన్యూ ఖర్చులకు,

‘గోల్డెన్ రూల్’ను ప్రభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయని

లోటును పూడ్చుకోవడానికి వాడుతున్నాయని కాగ్ తప్పుబట్టింది. ఆర్థిక నిర్వహణలో పాటించాల్సిన ‘గోల్డెన్ రూల్’ (Golden Rule) ను ప్రభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు సహా 11 రాష్ట్రాలు ఈ విధంగా రుణాలను పక్కదారి పట్టిస్తున్నాయని పేర్కొంది. ఏపీలో నికర రుణాల్లో కేవలం 26 శాతమే మూలధన వ్యయానికి వెచ్చిస్తున్నట్లు నివేదికలో వెల్లడైంది.రాష్ట్రాల స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) (GST) తో పోలిస్తే అప్పుల నిష్పత్తి కూడా ఆందోళనకరంగా పెరుగుతోందని కాగ్ తెలిపింది.

CAG Report

కాగ్ నివేదికపై కాంగ్రెస్ పార్టీ ఏమంది?

2023 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి పంజాబ్ అత్యధికంగా 40.35 శాతం రుణ నిష్పత్తితో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో నాగాలాండ్ (37.15%), పశ్చిమ బెంగాల్ (33.70%) ఉన్నాయి. మరోవైపు ఒడిశా (8.45%), మహారాష్ట్ర (14.64%), గుజరాత్ (16.37%) రాష్ట్రాలు మెరుగైన ఆర్థిక క్రమశిక్షణతో తక్కువ రుణ నిష్పత్తిని నమోదు చేశాయి.కాగ్ నివేదికపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది.

కేంద్ర ప్రభుత్వం ‘నిర్బంధ సమాఖ్యవాదం’తో రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛను హరిస్తోందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సుర్జేవాలా ఆరోపించారు. శనివారం ఆయన ఎక్స్ వేదికగా మాట్లాడుతూ.. రాష్ట్రాలను మున్సిపాలిటీల స్థాయికి కేంద్రం దిగజార్చుతోందని విమర్శించారు. జీఎస్టీ సెస్, ఏకపక్ష సుంకాలతో రాష్ట్రాల ఆదాయానికి గండి కొడుతున్నారని, దీనివల్లే అవి అప్పుల పాలవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/sanju-samson-successive-victories-are-due-to-them/sports/551376/

2025 economic review Breaking News CAG report financial analysis fiscal burden india state debts k sanjay murthy latest news rising loans state budget impact Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.