ఆంధ్రప్రదేశ్(AP) ప్రభుత్వం రాష్ట్ర పాలనా సౌలభ్యం, ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేసే ఉద్దేశంతో కీలకమైన నిర్ణయం తీసుకుంది. (Cabinet) జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుతో పాటు కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల మార్పులకు సోమవారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. రాయలసీమ ప్రాంతంలో పరిపాలనా అవసరాలను దృష్టిలో ఉంచుకుని మదనపల్లె కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయనున్నారు. అలాగే ప్రకాశం జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా మార్కాపురం కేంద్రంగా మరో కొత్త జిల్లా ప్రకటించారు. గిరిజన ప్రాంతాల్లో పరిపాలన సౌలభ్యం పెంచేందుకు రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Read Also: AP: ప్రజలకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
నియోజకవర్గాల మార్పులతో పరిపాలన సౌలభ్యం
జిల్లాల భౌగోళిక పరిమితులు, పరిపాలనా సౌలభ్యాన్ని మెరుగుపరిచే ఉద్దేశంతో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు మార్చే నిర్ణయం తీసుకున్నారు. (Cabinet) ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటి నియోజకవర్గాన్ని కొత్తగా ఏర్పడనున్న మదనపల్లె జిల్లాలోకి మార్చనున్నారు. అలాగే గతంలో అన్నమయ్య జిల్లాలో భాగంగా ఉన్న రాజంపేట నియోజకవర్గాన్ని తిరిగి కడప (వైఎస్ఆర్) జిల్లాలో విలీనం చేయనున్నారు. ఇక అన్నమయ్య జిల్లా పరిధిలో ఉన్న రైల్వేకోడూరు నియోజకవర్గాన్ని ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన తిరుపతి జిల్లాలోకి మార్చేందుకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: