📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Latest news: Bus tragedy: డ్రైవర్ నిర్లక్ష్యంపై పోలీసులకు పెరుగుతున్న అనుమానాలు

Author Icon By Saritha
Updated: October 28, 2025 • 12:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బస్సు ప్రమాదంలో డ్రైవర్ పై పోలీసుల అనుమానాలు

కర్నూలు(Kurnool) సమీపంలో 19 మంది ప్రాణాలు కోల్పోయిన బస్సు ప్రమాదం(Bus tragedy) కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. బస్సు డ్రైవర్ లక్ష్మయ్య నిర్లక్ష్యం వల్లే ఈ మృత్యు ఘోరం జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదానికి ముందు కేవలం 10–15 నిమిషాల వ్యవధిలోనే అదే మార్గంలో ప్రయాణించిన 19 భారీ వాహనాలు రోడ్డుపై పడి ఉన్న బైక్‌ను తప్పించుకుని వెళ్లాయని పోలీసులు గుర్తించారు. కానీ, అదే బైక్ బస్సు డ్రైవర్‌కి ఎందుకు కనిపించలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

శుక్రవారం తెల్లవారుజామున చిన్నటేకూరు సమీపంలో ఇద్దరు యువకులు బైక్‌పై వెళ్తూ డివైడర్‌ను ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. బైక్ రోడ్డు మధ్యలో పడిపోయిన దాదాపు పావుగంట తర్వాత బెంగళూరు వైపు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు ఆ బైక్‌పై దూసుకెళ్లింది. దాంతో బస్సు అగ్నికి ఆహుతై 19 మంది సజీవదహనమయ్యారు.

Read also: కొత్త ‘కవర్ ఫోటో’ ఫీచర్ – ప్రొఫైల్‌కు స్టైలిష్ టచ్

Bus tragedy: డ్రైవర్ నిర్లక్ష్యంపై పోలీసులకు పెరుగుతున్న అనుమానాలు

ఇతర డ్రైవర్ల సాక్ష్యం కీలకం

డ్రైవర్ లక్ష్మయ్యను పోలీసులు(Bus tragedy) అదుపులోకి తీసుకొని విచారించగా, అతని సమాధానాల్లో పొంతనలేమి కనిపించింది. వర్షం, చీకటి కారణంగా బైక్ కనిపించలేదని చెప్పినా, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అతని వాదనపై పోలీసులు సందేహం వ్యక్తం చేశారు. బైక్ రోడ్డుపై పడివుండగా ఒక వ్యక్తి గాయపడిన సహచరుణ్ని పక్కకు లాగుతున్నాడు. మేము ఆ బైక్‌ను తప్పించుకుని వెళ్లాం, అని ఆ సమయంలో ఆ మార్గంలో ప్రయాణించిన ఇతర డ్రైవర్లు పోలీసులకు వెల్లడించారు.

ఈ వాంగ్మూలాలు కేసులో కీలకంగా మారాయి. ప్రస్తుతం పోలీసులు ఆర్టీఏ, ఫోరెన్సిక్, అగ్నిమాపక శాఖ నివేదికల కోసం ఎదురుచూస్తున్నారు. అవి అందిన తర్వాతే బాధ్యతలపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా, ఈ ప్రమాదంలో మృతి చెందిన నెల్లూరు దంపతులు రమేశ్–అనూష పిల్లల అంత్యక్రియలకు వెళ్లిన వారి బంధువులు తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. వరుస దుర్ఘటనలు ఆ కుటుంబంపై విషాద ఛాయలు మోపాయి.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

driver negligence Kurnool bus accident Latest News in Telugu police investigation road safety Telugu News vehicle fire

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.