📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

budget: ఎంఎస్ఎం రంగానికి భారీ కేటాయింపులు: కొండపల్లి శ్రీనివాస్

Author Icon By Saritha
Updated: February 17, 2026 • 11:33 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సచివాలయం: Budget: రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగానికి అత్యంత ప్రాధాన్యత నిచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పధకం “ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త” ద్వారా 20లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం (Government) అడుగులు వేస్తుందని ఇది వికసిత్ భారత్-2047, స్వర్ణాంధ్ర 2047 దార్శనికతకు అనుగుణంగా రూపొందించబడిందని రాష్ట్ర సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన ప్రవాసాంద్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.

ఎంఎస్ఎంఈ క్లస్టర్, మౌలికసదుపాయాల అభివృద్ధికి రాష్ట్రంలో పారిశ్రామిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను సిద్దం చేసిందని అన్నారు. ఏపి-సిడిపి పధకం కింద రూ.200కోట్ల వ్యయంతో 5 ఏళ్ళలో 45 ఉమ్మడి సౌకర్య కేంద్రాల ఏర్పాటు చేయడం ద్వారా 1,688 కొత్త సంస్థలు ఆవిర్భవించనున్నాయని చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకటి చొప్పున 175ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు చేస్తున్నామని ఇప్పటికే 15 పార్కులు అందుబాటులోనికి రాగా, 82 పార్కులకు శంకుస్థాపన పూర్తిచేసి మౌలిక సదుపాయాల కల్పనా కార్యకలాపాలు వేగంగా జరుగుతున్నాయన్నారు.

Read Also: Tirupati: భక్తులకు టీటీడీ కీలక అలర్ట్ – దర్శనాలు, సేవల్లో మార్పులు

Budget: Huge allocations for MSM sector: Kondapalli Srinivas

బడ్జెట్ కేటాయింపులు:

క్లస్టర్ అభివృద్ధికి రూ.111.82 కోట్లు, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.100.00 కోట్లు, ఎంఎస్ఎంఈ యూనిట్ల ప్రోత్సాహాకాలకు రూ.229.36 కోట్లు, ఎస్సీ పారిశ్రామికవేత్తలకు రూ.316.38 కోట్లు, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు 5.71.20 కోట్లు ప్రోత్సాహకాల కేటాయించడం జరిగిందన్నారు. కోసం హార్టికల్చర్, ఎగుమతి రంగం అభివృద్ధిలో భాగంగా కొబ్బరి, జీడిమామిడి, కోకో రంగాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, కొబ్బరి ప్రాసెసింగ్లో రూ.1000 కోట్లు, కోకోలో రూ.400 కోట్ల పెట్టుబడి సామర్థ్యం ఉందన్నారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతులపై సుంకం లేని దిగుమతి పరిమితిని 1నుంచి 3శాతానికి పెంచడం వల్ల ఏపిలోని ఆక్వా రంగం మరింత ప్రపంచస్థాయి పోటీని తట్టుకొని ముందుకు సాగుతుందన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటిని ఒక పారిశ్రామిక కేంద్రంగా మార్చడమే మా లక్ష్యంగా ఈ బడ్జెట్ కేటాయింపులు మన యువతను ఉద్యోగాల కోసం వెతికే వారి నుండి, ఉద్యోగాలు ఇచ్చే వారిగా మారుస్తాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh Budget 2026-27 employment generation Latest News in Telugu MSME sector One Family One Entrepreneur Swarna Andhra 2047 Telugu News Viksit Bharat 2047

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.