📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

News telugu: BR Naidu: బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన : బిఆర్ నాయుడు

Author Icon By Sharanya
Updated: September 17, 2025 • 6:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల: టిటిడి చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది దేవ దేవుని బ్రహ్మోత్సవాలకు ఇస్రో సహకారం తీసుకుని, శాటిలైట్ ఆధారంగా భక్తుల సంఖ్యను గణన చేసేందుకు చర్యలు చేపట్టామని టిటిడి (TTD) ధర్మకర్తల మండలి చైర్మన్ బిఆరా ్నయుడు వెల్లడించారు. తొలిసారిగా చేపడుతున్న ఈ ప్రక్రియతో నిర్దిష్టంగా బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలలో ఎంత మంది భక్తులు ఉన్నారు. మాఢవీధుల్లో ఎంతమంది వాహనసేవలు వీక్షిస్తున్నారనే విషయంస్పష్టంగా తెలుస్తుందన్నారు.

దళితవాడల్లో వెయ్యి ఆలయాలు నిర్మాణం

సనాతన హిందూ ధర్మపరి రక్షణలో భాగంగా మతమార్పిడులను పూర్తిగా అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్లోని దళితవాడల్లో వెయ్యి ఆలయాలు నిర్మాణం చేపడతామని చైర్మన్
తెలిపారు. హిందూ ధార్మికసంస్థ టిటిడీపై పని గట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేసి, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చైర్మన్ బిఆర్ నాయుడు హెచ్చరించారు.
ఈ అంశంపై బోర్డు కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందన్నారు. వారంరోజుల్లో తిరుమలలో మొదలుకానున్న సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, టిటిడి చేపట్ట నున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ధర్మకర్తలమండలి సమావేశం జరిగింది. ఛైర్మన్ బిఆర్నాయుడు (BR Naidu)అధ్యక్షతన నాలుగుగంటలపాటు సాగిన ఈ బోర్డులో చర్చించి తీసుకున్న నిర్ణయాలను టిటిడి ఇఒ అనిల్కుమార్సింఘాల్, అడనపు ఇఒ చిరుమామిళ్ళ వెంకయ్యచౌదరి, బోర్డు సభ్యులతో కలసి మీడియాకు వెల్లడించారు. ఈనెల 24 నుండి అక్టోబర్ 2వరకు జరగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భక్తులరద్దీని అంచనావేసేందుకు ఇస్రో సహకారం తీసుకుంటున్నామన్నారు. గరుడసేవజరిగే 28వతేదీ తిరుమల ఆలయ మాడ వీధులతోబాటు తిరుమలకొండపై భక్తులరద్దీని గణనచేయనున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులను విశేషంగా ఆకట్టుకునేందుకు పుష్పాలంకర ణలు, వివిధ దేవతామూర్తుల ఆర్చీలు, ఎల్ఎడి తోరణాలు, పెద్దస్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. బ్రహ్మోత్సవాలకు ముందు మంగళవారం జరిగిన ధర్మకర్తలమండలి సమావేశంలో దేశవ్యాప్తంగా పలు అభివృద్ధి పనులకు, ఆలయాల నిర్మాణాలకు నిధులు మంజూరుచేస్తూ బోర్డు తీర్మానించింది.

శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో రాజగోపురం

కర్నాటక రాష్ట్రం బోలగావిలోని కోలకొప్పగ్రామంలో శ్రీవాణి ట్రస్ట్ నిధులతో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించేందుకు ఆమోదించారు. గుంటూరుజిల్లా తుళ్ళూరు మండలం అనంతవరం గ్రామంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో 7.20కోట్ల రూపాయలతో రాజగోపురం, శ్రీసుబ్ర మణ్య స్వామికి ఆభరణాలు, ఆలయంలో తాగునీటి సౌకర్యం, ఆర్చి, మరుగుదొడ్లు అభివృద్ధి కార్యక్ర మాలకు దశలవారీగా చేపట్టేందుకు నిర్ణయించారు. అన్నమయ్యజిల్లా వాల్మీకిపురంలోని పట్టాభిరామ స్వామి ఆలయ పుష్కరిణి, కల్యాణవేదిక మండపం, రాజగోపురం, ఆర్చి, కల్యాణ మండపం తదితర అభివృద్ధి పనులకు 5.73కోట్లు రూపా యలు, తరిగొండలోని లక్ష్మీనరసింహస్వామి పుష్క రిణి పునఃనిర్మాణానికి 1.50కోట్ల రూపాయలతో పనులు చేపట్టేందుకు నిర్ణయించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/sit-team-files-petition-seeking-custody-of-mithun-reddy/andhra-pradesh/549239/

BR Naidu Brahmotsavam 2025 Breaking News Devotee count ISRO Satellite Services latest news Telugu News Temple Festivals Tirumala News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.