📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ

News telugu: Kandula Durgesh: సుప్రసిద్ధ సాహితీవేత్త డాక్టర్ జి.వి.పూర్ణచందుకు బోయి భీమన్న స్మారక పురస్కారం:మంత్రి కందుల దుర్గేష్

Author Icon By Sharanya
Updated: September 20, 2025 • 4:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ: సమాజ రుగ్మతులను తన రచనల ద్వారా ఎత్తిచూపిన మహాకవి, పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ బోయి భీమన్న ప్రాతఃస్మరణీయులని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విజయవాడ కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ అధ్యక్షతన నిర్వహించిన డాక్టర్ బోయి భీమన్న 114వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ నేడు మనం మానవ హక్కులు, దళిత హక్కుల గురించి మాట్లాడుతున్నామన్నారు.

News telugu

అస్పృశ్యత తీవ్రంగా ఉన్న రోజుల్లోనే వీటి గురించి బోయి భీమన్న (Boyi Bhimanna)ప్రస్తావించడం గొప్ప విషయం అని అన్నారు. ఆయన నికార్సైన జాతీయవాదని చెప్పారు. ఆనాడు ఎదురవుతున్న సమస్యలను, విద్యను అభ్యసించడానికి ఉన్న ఇబ్బందులను తెలుపుతూ “జానపదుల జాబులు” అనే రచన చేశారని చెప్పారు. కుల, మత, వర్గ విభేదరహితమైన భారతజాతి ఆవిర్భావించాలనేదే తన ధ్యేయమని ప్రకటించిన భీమన్నది మహోన్నత వ్యక్తిత్వం అని, ఆయన మాట, బాట అందరికీ అనుసరణీయమని అన్నారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు ఆరు పర్యాయాలు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన, “తెలుగే ప్రాచీనం”, “తెలుగు కోసం” వంటి పరిశోధన గ్రంథాలతో పాటు సాహిత్య, వైజ్ఞానిక రచనలు, 150 కి పైగా రచనలు చేసిన డాక్టర్ జీవీ పూర్ణచందుకు బోయ భీమన్న పురస్కారం ఇవ్వడం భీమన్న గారికి సరైన నివాళి అని చెప్పారు. భీమన్న సతీమణి సుప్రసిద్ధ రచయిత్రి బోయి హైమావతి మాట్లాడుతూ… వైద్యులు, శతాధిక గ్రంథకర్త డాక్టర్ జీవి పూర్ణ చంద్ (Dr. Gv Poorna Chand)ను ఈ పురస్కారానికి ఎంపిక చేయటం సముచితమన్నారు.

పురస్కార గ్రహీత జీవీ పూర్ణచందు మాట్లాడుతూ…..

మాన వత్వమే భీమన్న గారి తారక మంత్రమని చెప్పారు. కులాల అడ్డుగోడలను తొలగించడానికి కులాంతర వివాహాన్ని ఒక పరిష్కారంగా భీమన్న సూచించారని తెలిపారు. అవార్డుకు తన పేరు సూచించినందుకు భీమన్న సతీమణి హైమవతికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రి దుర్గేష్ పూర్ణ చందును దుశ్శాలువాతో సత్కరించి, పురస్కారం అందజేశారు. జి వి పూర్ణ చందు రచించిన భువనవిజయం పుస్తకాన్ని ఆవిష్కరించి, బహుమతిగా స్వీకరించారు. కార్యక్రమంలో ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మకత అకాడమీ చైర్మన్ వి. గంగులయ్య, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ. డీఆర్వో లక్ష్మీనరసింహం, సాంస్కృతిక శాఖ సంచాలకులు మల్లికార్జునరావు, బోయి భీమన్న కుటుంబ సభ్యులు, భాషా సాంస్కృతిక శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/amaravati-global-city-vision-minister-narayana/andhra-pradesh/551042/

Andhra Pradesh News Boyi Bheemanna Award Breaking News Eminent Writers AP GV Poornachandra kandula durgesh latest news Telugu News Telugu Sahityam

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.