ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఈ వ్యవహారం పై చర్చకు వైసీపీ పట్టుబడుతోంది. మంగళవారం, బుధవారం కూడా వైసీపీ తీర్మానాన్ని ఛైర్మన్ తిరస్కరించారు. ఇందాపూర్, హెరిటేజ్ నెయ్యి సరఫరాపై చర్చకు తీర్మానాన్ని అందజేయగా, ఛైర్మన్ మోషేన్ రాజు దానిని డిస్మిస్ చేశారు. దీంతో మండలి విపక్ష నేత, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీలో ఇందాపూర్, హెరిటేజ్ నెయ్యి సరఫరాపై చర్చించాల్సిన అవసరం ఉందని, అసెంబ్లీలో చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని, అందుకే మండలిలో చర్చకు డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
Read Also: Madanapalle crime: మదనపల్లి ఘటనపై జగన్ తీవ్ర ఆగ్రహం
ఆసక్తిగా ఉంది
బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీ లాబీలో నిర్వహించిన చిట్ చాట్ లో స్పందించారు. మండలిలో వైసీపీ నేతలపై బొత్స సత్యనారాయణ పట్టు కోల్పోయారన్నారు. వైసీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్సీలు వేర్వేరుగా వాయిదా తీర్మానాలు ఇచ్చారని, ఒకరు లడ్డూకల్తీపై చర్చించాలని, మరొకరు ఇందాపూర్ డెయిరీపై చర్చించాలని అడిగారని పేర్కొన్నారు. ఇద్దరు ఎమ్మెల్సీల్లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలని ఆసక్తిగా ఉందన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: