Boggula Srinivas death : “పవన్ కల్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో” పుస్తకంతో గుర్తింపు పొందిన ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్‌లోకి ఆయన ప్రయాణిస్తున్న కారు దూసుకెళ్లిన ఘటనలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఉదయం సమయంలో కారును నీటిలో గమనించిన మత్స్యకారులు స్థానికులకు సమాచారం అందించగా, ట్రాక్టర్ సాయంతో కారును బయటకు తీశారు. వెనుక సీటులో కూర్చున్న శ్రీనివాస్ మృతి చెందినట్లు గుర్తించారు.
కారు నీటిలో పడిన సమయంలో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి బయటకు వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ అంశం పలు అనుమానాలకు దారితీస్తోంది. శ్రీనివాస్ నుదురు, ముఖంపై గాయాలు కనిపించడం వల్ల ఇది ప్రమాదమా? లేక ముందే దాడి జరిగిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Read Also: Winter Olympics: ఒలింపిక్స్ లో కండోమ్స్ కొరత
కర్నూలు జిల్లా అల్లూరు గ్రామానికి చెందిన శ్రీనివాస్ సాహిత్య పరిశోధకుడు, యూట్యూబర్‌గా కూడా గుర్తింపు పొందారు. 2014లో పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశంపై రాసిన ఆయన పుస్తకం పెద్ద చర్చకు దారితీసి లక్షల కాపీలు అమ్ముడైంది. ఆయన మరణం ప్రమాదం కాదని, హత్య జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్రైవర్ పరారవడం, కారు యజమాని స్నేహితుడు కూడా కనిపించకపోవడం కేసుకు మరింత అనుమానాస్పద మలుపు తిప్పింది. పోలీసులు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: