📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Bobbili: బొబ్బిలి వీణకు అరుదైన గుర్తింపు

Author Icon By Anusha
Updated: July 14, 2025 • 10:54 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నేడు ఢిల్లీలో అవార్డును అందుకోనున్న కలెక్టర్

బొబ్బిలి (విజయనగరం జిల్లా) : ఇప్పటికే దేశవిదేశాల్లో విశేష ప్రాచుర్యం పొందిన బొబ్బిలి వీణకు మరో అరుదైన గుర్తింపు లభించింది. ఒన్ డిస్ట్రిక్ట్… ఒన్ ప్రొడక్ట్ (ఒడిఒపి) బహుమతిక్రింద బొబ్బిలివీణ ఎంపికయ్యింది. ఒడిఒపి అవార్డుకు,రాష్ట్రం నుంచి 7 జిల్లాలకు చెందిన ఉత్పత్తులు ఎంపిక కాగా, బొబ్బిలికి చెందిన నమూనా వీణ ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. ఈ పురస్కారాన్ని అందుకునేందుకు జిల్లా కలెక్టర్ (District Collector) డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఢిల్లీ వెళ్లారు. కొత్త ఢిల్లీ ప్రగతి మైదానంలోని భారత్ మండపంలో సోమవారం జరిగే కార్యక్రమంలో ఒడిఒపి అవార్డును కలెక్టర్ అందుకోనున్నారు. బొబ్బిలి వీణకు దేశవిదేశాల్లో ఎనలేని ఖ్యాతి ఉంది. బొబ్బిలి వీణ అని విస్తృతంగా పిలువబడే బొబ్బిలి నుండి వచ్చిన సాంప్రదాయ ‘సరస్వతి వీణ’ విలక్షణమైన స్వరాలకు ప్రసిద్ధి చెందింది.

బొబ్బిలి నమూనా

అలాగే సర్వస్వతి వీణను పోలి ఉండే చిన్నపాటి వీణను బహుమతిగా, జ్ఞాపికగా ఇవ్వడం ఏళ్ల తరబడి సంప్రదాయంగా వస్తోంది. దేశంలోనే కాకుండా అంతర్జాతీయ సమావేశాలు, సదస్సుల్లో సైతం బొబ్బిలి నమూనా వీణలను జ్ఞాపికలుగా ఇవ్వడం జరుగుతోంది. బొబ్బిలి వీణ బొమ్మలతో పోస్టల్ స్టాంపులు, నాణేలు కూడా ముద్రితమయ్యాయి. ఇతర రాష్ట్రాలకు సైతం బొబ్బిలి వీణలు ఎగుమతి అవుతున్నాయి. ఢిల్లీ (Delhi) లో జరిగిన జి 20 సదస్సులో, విశాఖలో జరిగిన గ్లోబల్ సమ్మిట్లో సైతం బొబ్బిలి వీణ ప్రదర్శనలు జరిగాయి. అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్ ఈ వీణను చూసి ముచ్చట పడ్డారు. బొబ్బిలి వీణకు ఇప్పటికే మన కేంద్ర ప్రభుత్వం నుంచి భౌగోళిక గుర్తింపు కూడా లభించింది.

Bobbili: బొబ్బిలి వీణకు అరుదైన గుర్తింపు

అరుదైన హస్త కళగా గుర్తింపు పొందింది

బొబ్బిలి పట్టణానికి సమీపంలోని గొల్లపల్లి వీణల తయారీకి ప్రసిద్ధి చెందింది. వీణల తయారీ ఒక అరుదైన హస్త కళగా గుర్తింపు పొందింది. ఈ గ్రామంలోని దాదాపు 300 కుటుంబాలు గత 100 సంవత్సరాలకు పైగానే తమ జీవనోపాధి కోసం వీణల తయారీలో నిమగ్నమై ఉన్నాయి. బాడంగి మండలం వాడాడలో కూడా ప్రస్తుతం వీణలు తయారవుతున్నప్పటికీ, వాటికి కూడా బొబ్బిలి వీణలుగానే పరిగణిస్తున్నారు. వీటి తయారీకి పనస మరియు సంపంగి కలప చెక్కను ఉపయోగిస్తారు. వీణ (Veena) ల తయారీకి కలప కొరతను నివారించేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తృతంగా పనస చెట్లను పెంచాలని ప్రభుత్వం ఇటీవలే నిర్ణయించింది. ఒడిఒపి క్రింద బొబ్బిలి వీణకు గుర్తింపు లభించడంతో, వీటి ఖ్యాతి మరింత ఇనుమడిస్తుందనడంలో సందేహం లేదు.

బొబ్బిలి వీణ ఏ చెక్కతో తయారు చేస్తారు?

బొబ్బిలి వీణకు ఉపయోగించే కలప పనస (జాక్‌ఫ్రూట్ చెట్టు) . కళాకారులు ఒకే చెక్క దుంగను ఉపయోగిస్తారు, దానితో వాయిద్యం యొక్క వివిధ భాగాలు తయారు చేయబడతాయి.

బొబ్బిలి వీణ ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ సంగీత వాయిద్యం?

ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున ఉన్న బొబ్బిలి పట్టణంలో ‘వీణ’ అనే నిజంగా ప్రత్యేకమైన సంగీత వాయిద్యం దొరుకుతుంది; కర్ణాటక సంగీతంలో దీని ఉపయోగం ప్రేక్షకులను స్పష్టంగా ఆకట్టుకుంటుందని తెలిసింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: CM Chandrababu : నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

Andhra Pradesh crafts Bobbili artisans Bobbili Veena Breaking News Indian musical instruments ODOP Award Sarawathi Veena Telugu News Traditional Veena Vishakapatnam culture

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.