📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: Blue Collar Jobs: జనవరిలో డిఎస్సీ నోటిఫికేషన్: మంత్రి లోకేష్

Author Icon By Radha
Updated: October 11, 2025 • 11:09 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఓం క్యాప్ ద్వారా లక్ష బ్లూకాలర్ ఉద్యోగాల లక్ష్యం

విజయవాడ: ఓం క్యాప్ కార్యక్రమం ద్వారా రాబోయే అయిదేళ్లలో లక్ష బ్లూకాలర్ ఉద్యోగాలు(Blue Collar Jobs) కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష ్యమని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) స్పష్టం చేశారు. రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధి ద్వారా సుస్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఇందుకు ప్రణాళికాబద్ధమైన రూట్ మ్యాప్ సిద్ధం చేయాలనే ఈ దిశగా స్కిల్ డెవల ప్మెంట్ కార్పొరేషన్ అధికారులు రూపొందించాలన్నారు.

Read also: Jr NTR: ఘనంగా నార్నే నితిన్ వివాహం.. పెళ్లిలో తారక్ సందడి

ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని ప్రతి యువకుడికి నైపుణ్య బ్లూకాలర్(Blue Collar Jobs) ప్రాధాన్యత కల్పించే విధంగా ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేయాలని సూచించారు.

‘ఎక్స్ ‘వేదికగా ఆయన ఇందుకు సంబంధించి సమగ్ర సమాచారం వివరించారు. నర్సింగ్, వెల్డింగ్, ట్రక్కింగ్, బిల్డింగ్ వర్కర్లకు యూరప్ తో పాటు జర్మనీ, ఇటలీ దేశాల్లో మంచి డిమాండ్ ఉందని పేర్కొన్నారు. ఆ రంగాల్లో విద్యనభ్యసించిన యువతకు ఆయా దేశాల భాషల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చి, విదేశీ ఉద్యోగ అవకాశాలు లభించేలా అధి కారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

నర్సింగ్, వెల్డింగ్, నిర్మాణ రంగాల్లో విదేశీ ఉద్యోగావకాశాలు

నర్సింగ్ రంగంలో ఉద్యోగాల ప్రోత్సాహానికి కేరళ మోడల్ ఆదర్శమని, ఆ రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసి, ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలనిమంత్రి ఆదేశించారు. యూరప్, జీసీసీ దేశాల్లో డిమాండ్ ఉన్న ఉద్యోగాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కూడా స్పష్టం చేశారు.

నైపుణ్యం పోర్టల్లో ఇప్పటికే 23 విభాగాల డాటాబేస్ ను ఇంటిగ్రేట్ చేశామని మంత్రి వివరించారు. రాష్ట్రంలో ఉన్న 4,639 భారీ, మధ్యతరహా పరిశ్రమల అవసరాలను గుర్తించి, వారికి అనుగుణంగా వర్క్్ఫర్ను సిద్ధం చేయాలని సూచించారు. వచ్చే నెలలో ఈ పోర్టల్ను అధికారికంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆ సమయానికి యువతకు ఉద్యోగాలపై సంపూర్ణ సమాచారం ఒకే వేదికపై అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

రాష్ట్రంలోని 83 ప్రభుత్వ ఐటీఐలను మిషన్ మోడ్లో అభివృద్ధి చేయాలని మంత్రి ఆదేశించారు. పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన, పీఎంఇంటర్న్షిప్ కార్యక్రమాలలో ఆంధ్రప్రదేశ్ను దేశంలో నంబర్ వన్గా నిలపాలని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. ఐటీఐల్లో కరిక్యులమ్, టెస్టింగ్, ఇంటర్న్షిప్, సర్టిఫికేషన్, ప్లేస్మెంట్స్ అంశాలలో నాణ్యత పెంచాలని మంత్రి స్పష్టం చేశారు. పాలిటెక్నిక్ కళాశాలలను మెరుగ్గా తీర్చిదిద్దేందుకు దేశంలోని విజయవంతమైన మోడళ్లను అధ్యయనంచేసి అమలు చేయాలని ఆదేశించారు.

హబ్ అండ్ స్పోక్ మోడల్ స్కిల్ అభివృద్ధి: స్కిల్ డెవలప్మెంట్ ప్రణాళికలో భాగంగా హబ్ అండ్ స్పోక్ మోడల్ను అవలంబించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా విశాఖపట్నం, అనంతపురం, చిత్తూరు జిల్లాలను ప్రధాన హబ్లుగా అభివృద్ధి చేస్తారు.

ఈ హబ్లకు అనుబంధంగా 13 స్పోక్స్ సెంటర్లు ఏర్పాటు చేసి, రాష్ట్రవ్యాప్తంగా ఐటీఐలను నైపుణ్య శిక్షణ కేంద్రాలుగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు.

ఆర్సెలర్ మిట్టల్ అండ్ నిప్పాన్ స్టీల్స్ అనుబంధ సంస్థ నామ్ టెక్ రాష్ట్రంలో నైపుణ్య శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిందని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ఈ భాగస్వామ్యం ద్వారా రాష్ట్ర యువతకు అంతర్జాతీయ ప్రమాణాల నైపుణ్య శిక్షణ లభించే అవకాశం ఉందన్నారు.

ఇక ఉపాధ్యాయ ఖాళీల భర్తీకోసం జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. మార్చిలో స్పెషల్ డీఎస్సీ పరీక్షలు నిర్వహించి స్కూళ్లు ప్రారంభం అయ్యే నాటికి కొత్త టీచర్లను రిక్రూట్ చేస్తామని తెలిపారు. స్పెషల్ డీఎస్సీలో భాగం గా ఆర్థికశాఖ 2,260 పోస్టులకు ఆమోదం తెలిపింది. డీఎస్సీకి ముందు నవంబర్లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

DSC notification education department ITI Colleges Nara Lokesh Polytechnic Colleges youth employment

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.