📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా? వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’ ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా? వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’

Blue Bird Block-2: ఎల్వీఎం3-ఎం6 ఘన విజయం.. దేశవ్యాప్తంగా అభినందనలు

Author Icon By Tejaswini Y
Updated: December 24, 2025 • 2:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ రోజు ప్రయోగించిన ఎల్వీఎం3–ఎం6 రాకెట్ మిషన్ ఘన విజయం సాధించింది. అత్యాధునిక కమ్యూనికేషన్ ఉపగ్రహం అయిన బ్లూబర్డ్ బ్లాక్–2(Blue Bird Block-2)ను విజయవంతంగా కక్ష్యలోకి చేర్చడం ద్వారా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక ఘట్టాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో దేశవ్యాప్తంగా ప్రశంసల వెల్లువ వెల్లువెత్తింది.

Read Also:  ISRO: ఈరోజు బహుబలి రాకెట్ ప్రయోగించనున్న ఇస్రో

ఈ సాధనపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్(S. Abdul Nazir) ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. భారత్ నుంచి ఇప్పటివరకు పంపిన అత్యంత భారీ ఉపగ్రహంగా ఇది చరిత్రలో నిలిచిందని పేర్కొంటూ, ఈ మిషన్ దేశ అంతరిక్ష ప్రయాణంలో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) కూడా ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ ఇస్రో బృందాన్ని అభినందించారు. భారీ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ద్వారా భారత వాణిజ్య అంతరిక్ష రంగానికి మరింత బలం చేకూరిందని అన్నారు. అంతర్జాతీయంగా విశ్వసనీయ లాంచ్ దేశంగా భారత్ స్థానం మరింత పటిష్టమైందని తెలిపారు.

రాష్ట్ర ఐటీ, హెచ్‌ఆర్‌డీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ విజయాన్ని ‘బాహుబలి’ ఎల్వీఎం3 రాకెట్ ప్రతిభకు నిదర్శనంగా అభివర్ణించారు. ఈ ప్రయోగం భారత వాణిజ్య ఉపగ్రహ ప్రయోగ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Baahubali Rocket BlueBird Block 2 Communication Satellite ISRO LVM3 LVM3 M6 Mission Satish Dhawan Space Centre Sriharikota

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.