📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

BJP : రాయలసీమ అభివృద్ధికి బిజెపి కృషి చేస్తోంది : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్

Author Icon By Shravan
Updated: July 31, 2025 • 12:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అనంతపురం :  రాయలసీమ అభివృద్దికి కేంద్రంలోని బిజెపి (BJP) ప్రభుత్వం కృషి చేస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పేర్కొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం నగరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ రాయలసీమ సమస్యలపై 2007లో చేసిన తీర్మాణాన్ని అమలు చేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేసేలా కేంద్రం దృష్టికి తీసుకెళ్ళమని పేర్కొన్నారు. జిల్లాలో హార్టికల్చర్ హబ్తోపాటు పారిశ్రామికంగా అభివృద్ధి చేసే దిశగా బిజెపి కృషి చేస్తుందని పేర్కొన్నారు. హార్టికల్చర్ హబ్ అభివృద్ధిలో భాగంగా దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా కిసాన్ రైలును అనంతపురం నుంచి ప్రారంభించారని గుర్తు చేశారు.

అనంతపురంలో (Ananthapuram) మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ రావడం శుభ పరిణామం అని, వ్యవసాయ ఆధారిత పరిశ్రమతోపాటు టమోటా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా త్వరలో రాయలసీమకు రాబోతోందని ఆయన పేర్కొన్నారు. పాడి పరిశ్రమలు కొంత మంది శాసిస్తుండటం వల్లే పాడి రైతులకు మంచి రేటు రావడం లేదని ఆయన అభిప్రాయ పడ్డారు. మహిళలు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకై రుణాలను అందించేందుకు కమిటీలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. జిల్లాలో పెనుకొండ, కళ్యాణదుర్గంతోపాటు అనేక చారిత్రాత్మక కోటలు, దేవాలయాలు ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేసి జిల్లా సాంస్కృతిక వైభవాన్నిప్రపంచానికి చాటి చెప్పే దిశగా కేంద్రంతో చర్చించనున్నట్లు పేర్కొన్నారు.

ప్రజల ఆలోచన విధానాలను తెలుసుకుంటున్నామని వారి ఆలోచన విధానాలకు అనుగుణంగా పథకాలను తీసుకురానున్నామన్నారు. కేంద్రంలో ఎన్డీయే అధికారంలో వచ్చిన తర్వాత అనేక ప్రజా సంక్షేమ పథకాలు అమల్లోకి వచ్చాయని, ప్రతి ఇంటి తలుపు తట్టి కేంద్రం అందించిన పథకాలను, అభివృద్ధిని వివరిస్తామని పేర్కొన్నారు.

Read Hindi News : hindi.vaartha.com

Read also : Quartz Business : మంచి చేయాలనుకుంటే నిందలు మోపుతున్నారు–క్వార్ట్జ్ బిజినెస్‌ను వదిలేస్తున్నా:ఎంపీ వేమిరెడ్డి

Andhra politics BJP BJP Andhra Pradesh Breaking News in Telugu Latest News in Telugu PVN Madhav Rayalaseema Development Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.