📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

CRS : ఏపీలో జననాలు తగ్గి, మరణాలు పెరుగుతున్నాయ్

Author Icon By Sudheer
Updated: June 12, 2025 • 9:33 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లో జననాల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (CRS)–2022 నివేదికలో వెల్లడైంది. 2015లో 8.51 లక్షల జననాలు నమోదవగా, 2022 నాటికి ఇవి 7.52 లక్షలకు పడిపోయాయి. ఇది ప్రజల జీవిత విధానంలో మార్పుల్ని సూచిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. ఖర్చులు పెరగడం, జీవన పోరాటం, పిల్లల భవిష్యత్తు పై ఆందోళన, ఆలస్య వివాహాలు, వలసలు తదితర అంశాలే ఈ తగ్గుదలకు కారణమని భావిస్తున్నారు.

డబ్బు సంపాదన లో పడి పిల్లలను కనాలనే ఆలోచన లేకపోవడం

వీటితోపాటు, ఉద్యోగం, కెరీర్, జీవన శైలిపై దంపతులు ఎక్కువ దృష్టి పెట్టడమే పిల్లలను కనాలనే నిర్ణయాన్ని ఆలస్యం చేయడానికి దారి తీస్తోంది. ఈ నేపథ్యంలో జనాభా వృద్ధి రేటు తగ్గుతోంది. చిన్న కుటుంబ వ్యవస్థలు, దంపతులలో భవిష్యత్తుపై ఆందోళనలు కూడా ఈ మార్పుకు బలమైన కారణాలుగా భావించవచ్చు. ప్రభుత్వం ప్రజల్లో ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్థిరత్వం కల్పించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్లు నిపుణులు సూచిస్తున్నారు.

మరణాల సంఖ్యలో పెరుగుదల

మరోవైపు మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశంగా నిలుస్తోంది. 2018లో 3.75 లక్షల మరణాలు నమోదవగా, 2022 నాటికి ఇవి 4.30 లక్షలకు పెరిగాయి. ఇందులో కరోనా మహమ్మారి ప్రధాన కారణంగా చూపిస్తున్నారు. మహమ్మారి వల్ల భారీగా ప్రాణనష్టం జరిగిందని నివేదిక స్పష్టం చేసింది. ప్రభుత్వాలు మెరుగైన ఆరోగ్య సదుపాయాలను అందించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. జనన–మరణల ఈ గణాంకాలు ప్రజారోగ్యం, సామాజిక స్థితిగతులపై ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని నిపుణుల అభిప్రాయం.

Read Also : Anakapalle : రసాయన వాయువులు పీల్చి ఇద్దరు మృతి

Ap Births are decreasing CRS deaths are increasing Google News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.