ఆరోగ్య రంగంలో వేగంగా జరుగుతున్న మార్పుల నేపథ్యంలో, బయోబ్యాంక్ అనే భావన వైద్య రంగం లో కొత్త ప్రాధాన్యం సంతరించుకుంది. మనుషుల నుంచి సేకరించే రక్తం, కణాలు వంటి జీవ నమూనాలను భద్ర పరచి, వాటికి సంబంధించిన వ్యాధుల కారణాలు, జన్యు ప్రభావాలు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను అర్థం చేసుకో వడానికి వినియోగించడం ఇప్పుడు పరిశోధనలో ఒక ముఖ్య భాగంగా మారింది. 1996లో స్టెఫెన్ లాఫ్ట్హెన్రిక్ పౌల్సె న్ ‘బయోబ్యాంక్ అనే పదాన్ని పరిచయం చేసిన తర్వాత, ఈ రంగం ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతోం ది. ఈ నేపథ్యంలో భారత్ కూడా తన జన్యు వైవిధ్యాన్ని శాస్త్రీయ పరిశోధన కోసం వినియోగించేందుకు కీలకమైన అడుగు వేసింది. ఫీనోమ్ ఇండియా నేషనల్ బయోబ్యాంక్ దేశంలోని వివిధ ప్రాంతాలు, సమాజాలు, సాంస్కృతిక నేపథ్యాలు, జీవనశైలి అలవాట్లు, సామాజిక-ఆర్థిక పరి స్థితులను ప్రతిబింబించే జన్యు, ఆరోగ్య డేటాను సేకరి స్తోంది. యుకే బయోబ్యాంక్ (Biobanking)నమూనాను భారత ఆరోగ్య అవసరాలకు సరిపోయేలా మార్చుకొని, దేశవ్యాప్తంగా 10,000 మంది నుంచి నమూనాలు సేకరించే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ కొనసాగుతోంది. ఈ డేటా ద్వారా భారతీయుల ఆరోగ్య ప్రత్యేకతలు, వ్యాధుల ప్రమాదాలు, వాటి వెనుక ఉన్న జన్యు పర్యావరణ ప్రభావాలపై మరింత స్పష్టమైన గణాంకపరమైన అవగాహన లభిస్తోంది.
Read Also : http://Covid-19: కరోనా మహమ్మారి ఆరేళ్లు
జాతీయ బయోబ్యాంక్
భారత జనాభాలో కనిపించే ఆరోగ్య నమూనాలు ఎన్నాళ్లుగానో అంతర్జాతీయ పరిశోధకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తక్కువ బరువులోనే మధుమేహం రావడం, హద్రోగాలు తక్కువ వయస్సులోనే కనిపించడం, ఒకే వ్యాధి వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు రీతుల్లో కనిపించడం వంటి విషయాలకు ఇంకా స్పష్టమైన శాస్త్రీయ కారణాలు పూర్తిగా బయటపడలేదు. ఈ నేపథ్యం లో, జాతీయ బయోబ్యాంక్ (Biobanking) సేకరిస్తున్న దీర్ఘకాలిక డేటా జన్యు పర్యావరణ కారకాలు కలిసి ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతాయో అర్థం చేసుకోవడంలో సహాయపడుతోంది. క్యాన్సర్, హృద్రోగాలు, మధుమేహం, అరుదైన జన్యు రుగ్మతల పరిశోధనలో బయోబ్యాంక్లు ముఖ్యపాత్ర పోషిస్తున్నా యి. సిఆర్ఎస్ఏఆర్ ఆధారిత జీన్ థెరపీలు, అలాగే కృత్రిమ మేధస్సు ఆధారిత నిర్ధారణ మోడళ్లకు కావాల్సిన పెద్ద పరిమాణంలో జన్యుడేటాను ఇవే అందిస్తాయి. కొవిడ్ -19 చేపట్టిన జీనోమ్ సీక్వెన్సింగ్ భారత శాస్త్రీయ సామ ర్థ్యాన్నిస్పష్టంగా చూపించింది. ఇదే విధంగా, ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న నేషనల్ బయోబ్యాంక్ భవిష్యత్ వైద్య పరిశోధనలు, ఖచ్చితమైన నిర్ధారణ పద్ధతులు కొత్త చికిత్సా ఆవిష్కరణలకు ఒక స్థిరమైన ఆధారంగా నిలుస్తోంది. బయో బ్యాంకింగ్ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, గోప్యత నైతికతకు సంబంధించిన సవాళ్లు కూడా స్పష్టంగా కనిపిస్తు న్నాయి. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 వ్యక్తిగత డేటా రక్షణకు ఒక ప్రాథమిక వ్యవస్థను అందించి నా, జెనోమిక్ డేటా వంటి అత్యంత సున్నితమైన సమాచా రానికి అవసరమైన ప్రత్యేక మార్గదర్శకాలు ఇంకా పూర్తిగా రూపుదిద్దుకోలేదు.
భవిష్యత్ చికిత్సా విధానాలు
అంతర్జాతీయ పరిశోధనల కోసం డేటాను పంచుకునే సమయంలో పారదర్శకత చాలాముఖ్యం. ఎందు కంటే బీమా సంస్థలు లేదా ఉద్యోగదాతలు ఈ సమాచారా న్ని దుర్వినియోగం చేసే ప్రమాదం కూడా ఉంది. ఈ నేప థ్యంలో ప్రజల నమ్మకాన్ని కాపాడేందుకు కమ్యూనిటీ భాగస్వామ్యం, అలాగే డేటా ఎలా ఉపయోగించబడుతుందో స్పష్టంగా వివరించడం అత్యవసరం. హైదరాబాద్లో ఇటీ వల ప్రారంభమైన భారత తొలి జంతు స్టెమ్సెల్ బయో బ్యాంక్ దేశం బయోటెక్నాలజీ రంగంలో ఒక ముఖ్యమైన ముందడుగు. ఈ కేంద్రాన్ని నేషనల్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ యానిమల్బ యోటెక్నాలజీ నిర్వహిస్తోంది. వివిధ జంతు జాతుల నుంచి స్టెమ్ సెల్సను సేకరించి భద్రపరచడం ద్వారా వెటర్నరీ వైద్యం, కల్చర్డ్ మీట్పరిశోధనలు, జీవవై విధ్య సంరక్షణ, వ్యాధి నమూనాల అధ్యయనాలకు ఇది అవసరమైన ఆధారాలను అందిస్తోంది. ఇలాంటి సదుపాయాలు పెరగడం వల్ల భారతదేశంలో ఆరోగ్య పరిశోధనలు భవిష్యత్ చికిత్సా విధానాలు మరింత మెరుగుపడే అవకా శం ఉంది. ఖచ్చితమైన నిర్ధారణలు, వ్యక్తిగతీకరించిన చికి త్సలు వ్యాధులను ముందుగానే గుర్తించే పద్ధతులు ఇవి అన్నీ బయోబ్యాంక్ల ద్వారా లభించే సమాచారంతో వేగం గా అభివృద్ధి చెందుతున్నాయి. శాస్త్రీయ బాధ్యత, నైతికత, గోప్యత ప్రజల విశ్వాసం బలంగా కొనసాగితే, బయోబ్యాం కింగ్ భారత ఆరోగ్య వ్యవస్థకు దీర్ఘకాలికప్రయోజనాలను అందించే ఒక ప్రధాన శక్తిగా నిలుస్తుంది.
– డా. కృష్ణ కుమార్ వేపకొమ్మ
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: