📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

Bill gates : కొత్త ఆశల ‘గేట్ ?

Author Icon By Sudha
Updated: February 18, 2026 • 11:08 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

డిజిటల్ విప్లవానికి భారత్లో బలమైన పునా దులున్నాయి. అది గుర్తించిన వారు మాత్రమే భారత్తో మమేకమై పయనిస్తారు. అందుకే దేశ రాజధానిలో జరుగుతున్న ఎఐ -సమ్మిట్లో ఎంతో మంది టెక్నాలజీ సంస్థల అధినేతలు కదిలి వచ్చారు. ఇదే సమయంలో మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ తెలుగునేలపై మరోసారి అడుగుపెట్టారు. టెక్నాలజీ అనుసంధానంతో సుపరి పాలన సాధ్యమేనని నమ్మి రియల్ టైమ్ గవర్నెన్స్ లో ఆటోమేషన్ దిశగా అడుగులేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఎంతటి అధునాతన ప్రణాళికలు సృష్టించాలన్నా పాలకులకు దూరదృష్టి ఉండాలి. అలా ఉన్న నేతల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన రియల్ టైమ్ గవర్నెన్స్ గేట్స్ఫౌండేషన్ అధినేత మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill gates)ను ఆకట్టుకొంది. డేటా లేక్, అవేర్ 2.0, వాట్సప్ గవర్నెన్స్, పీపుల్స్ పెర్సెప్సన్, ఏజంట్ స్పేస్, ఎపి ఎఐ సెర్చ్ బార్, సంజీ వని, అమరావతి ప్రాజెక్టులపై ఆయన అధికారులను అడిగి మరీ తెలుసుకున్నారు. 1997లో ఓసారి ఆయన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానంపై హైదరాబాద్ వచ్చివెళ్లారు. హైటెక్ సాంకేతిక అభివృద్ధిలో ఒక స్ఫూర్తి ఆయన పర్యటన మిగిల్చింది. మళ్లీ మూడు దశాబ్దాల తర్వాత పాతతరం స్నేహాన్ని పురస్కరించుకుని ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ పర్యట నకు బిల్ గేట్స్ (Bill gates)రావడం ముదావహం. భవిష్యత్లో గేట్స్ ఫౌండేషన్ చేపట్టే ప్రాజెక్టులలో ఆంధ్రప్రదేశ్ శక్తి సామ ర్థ్యాలను వినియోగించుకోవాలన్న ఆకాంక్ష ఈ పర్యటనలో కనపడుతోంది. కొన్ని పరిచయాలు కొందరి విషయంలో అద్భుతాలు సృష్టిస్తాయి. మూడు దశాబ్దాల నాటి బిల్ గేట్స్ సాన్నిహిత్యం, సహచర్యం, ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ పంట పండింది. ‘హలో ఫ్రెండ్.. హౌఆర్యూ’ అని బిలేట్స్ తెలుగుదేశాధినేతను పలకరించడాన్ని బట్టి ఆ రాష్ట్రానికి ఏదో మేలు జరిగే శుభసూచనలు కనపడుతు న్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘క్వాంటమ్ కంప్యూటింగ్ అద్భుతాలు చేస్తుంది. ఆరోగ్య సంరక్షణ, ఔషధ పరిశోధనలు, సైబర్ భద్రతలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగల శక్తి దానికి ఉంది. అయితే అలాంటి టెక్నాలజీకి సాంకేతిక అనుసంధానం కోసం బిల్ గేట్స్ వంటి మేధావులు అండదండలు కూడా అవస రమే. అందుకోసమే ఆ రాష్ట్రపాలకులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అన్నిరంగాల్లో అద్భుతాలు సృష్టిం చవచ్చుననే దృక్పథంతో సర్వశక్తులూ ఒడ్డి పరిపాలి స్తున్నారు. సాంకేతిక విప్లవ మార్పులతో ఆంధ్రాలో అద్భుత ప్రపంచాన్ని సృష్టించే ప్రయత్నానికి ఆయన రాక ఒక సంకేతం. దేశ విదేశాల్లో కృత్రిమ మేధ ఒక అద్భుత పయనం. దాని విషయంలో ఎపి తామూ ముందడుగే అని వడివడిగా అడుగులు వేస్తున్న తరుణంలో బిలేట్స్ రాక కొండంత బలమే. ఆరోగ్య సేవలను ప్రజలకుమరింత చేరువ చేయాలనే సంకల్పంతో బిల్ గేట్స్ ఫౌండేషన్ కార్య క్రమాలుండడంతో ఆయన ‘కుప్పం’లోని సంజీవని ప్రాజెక్టులో భాగస్వామిగా ఉన్నారు. విశేషించి విభజిత తెలుగు రాష్ట్రంలో వ్యవసాయంలో కృత్రిమ మేధను ఉపయోగించడాన్ని బిలేట్స్ ప్రస్తుతించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా సాగులో ఎఐని వాడకపోవడాన్ని గురించి ప్రస్తావించారు. డ్రోన్ వ్యవసాయాన్ని మన ప్రధాని నిత్యం వల్లించే ప్రకృతి వ్యవసాయాన్ని ఉండవల్లి అరటితోటలలోకి వెళ్లి స్వయంగా వీక్షించారు. ఎక్కడినుంచి వచ్చినా ఇక్కడివానిలానే ఆంధ్రప్రాంతపు రైతులతో మమే కమయ్యారు. వారి అనుభవాలను క్రోడీకరించుకుని, వారి ఆశయాలకు కృత్రిమమేధ ప్రోత్సాహం నిచ్చెనలువేసారు. కొంత మంది మంత్రుల ప్రశ్నలకు భవిష్యత్తులో కృత్రిమ మేధవల్ల ఉద్యోగుల సంఖ్య తగ్గుతుందంటూనే పనిలో ‘హ్యూమన్ టచ్’ అనేది ఉండదన్నారు. విజనరీ ఆలోచనలకు తానెప్పుడూ పరవశమవుతాననే అర్థం వచ్చే ఎన్నో విషయాలను ప్రస్తావించారు. ఏదో చూడడానికి, ఎవరినో ప్రశంసించడానికి వచ్చినట్లుకాకుండా తనముందు ప్రదర్శించిన అన్ని అంశాలపై డిస్ప్లేవాల్ ప్రెజంటేషన్ ను సావధానంగా వీక్షించి మెచ్చుకున్నారు. నాడు ఐటి, నేడు ఎఐ క్వాంటమ్ టెక్నాలజీలు రెండూ తెలుగు రాష్ట్రాలకు చిరుదివ్వెలేననే అభిప్రాయాన్నిఆయన వ్యక్తం చేశారు. విపత్తుల నిర్వహణ కోసం టెక్నాలజీతో ముందస్తు అంచ నాలు వేసి అప్రమత్తమయ్యే వ్యవస్థను ఆయన ప్రశంసిం చారు. సాగులో సాంకేతికత పట్ల సంతోషించారు. రాష్ట్రం లో వనరులకు లోటులేదని, సంపద సృష్టించడమే తరు వాయి అని అది బిలేట్స్ రాకతో నెరవేరు తుందన్న ఆశాభావం పాలకుల్లో కలిగింది. గేట్స్ ఫౌండేషన్ భాగ స్వామ్యం గేమ్చేంజర్ అని, ఆంధ్రప్రదేశ్ గేట్స్ ఫౌండే షన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంతో రాష్ట్రాభివృద్ధికి కొత్త దశ, దిశ ఏర్పడుతుందని సిఎం చంద్రబాబు ఆశా భావం. ఎపిలో మొత్తం పది రంగాలు, 30 ప్రభుత్వ విభాగాలో ఎఐని వినియోగిస్తున్నారు. 98 ఎఐ యూజ్ కేసులు, 43 హ్యాక్ థాన్లు ఉన్నాయి. ఏడు డేటాక్లున్నా యి. యూనివర్సల్ హెల్త్స్ర్కీనింగ్, ఆయు ష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అమలు సజావుగా జరుగుతోంది. సంజీ వని ప్రాజెక్టును సమగ్ర ఆరోగ్య వేదికగా తీర్చిదిద్దే సంకకల్పాన్ని కొనియాడారు. ఒక ప్రాంతంమీద ప్రేమతోనో, ఒక నేత మీద నమ్మకంతోనో కాకుండా గేట్స్ ఫౌండేషన్ సంకల్పాలు చాలా భిన్నంగా ఉంటాయి. ఆ మేరకు మన సంకల్పాలను కూడా తీర్చిదిద్దగలిగితే ఆయనతో చెలిమి మన ఆకాంక్షలను సుసంపన్నం చేయగలదు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

bill gates Breaking News innovation latest news Microsoft Philanthropy Technology Leadership Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.