Bihar to Telangana Rice Scam: అల్లాదుర్గంలో అక్రమ బియ్యం లారీ పట్టివేత

Read Time:  1 min
Bihar to Telangana Rice Scam: అల్లాదుర్గంలో అక్రమ బియ్యం లారీ పట్టివేత
FONT SIZE
GET APP

Bihar to Telangana Rice Scam: మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలో అక్రమంగా రవాణా అవుతున్న బియ్యం లారీని పోలీసులు పట్టుకున్నారు. బీహార్ రాష్ట్రంలోని ప్రైవేటు వ్యక్తుల నుండి సేకరించిన దొడ్డు రకం బియ్యాన్ని లారీల్లో నింపి, అల్లాదుర్గం మండలంలోని గడి పెద్దాపూర్ గ్రామ పరిధిలో గల శ్రీ సాయి బిన్నీ రైస్ మిల్లుకు తరలిస్తుండగా పోలీసులు మాటు వేసి పట్టుకున్నారు. సరైన ధ్రువపత్రాలు లేకుండా రవాణా చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు లారీని స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Read Also: TTD International Women’s Day: టీటీడీలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

Bihar to Telangana Rice Scam: భారీగా పట్టుబడ్డ నిల్వలు – విలువ ₹11 లక్షలు

స్వాధీనం చేసుకున్న లారీలో సుమారు 42 టన్నుల బియ్యం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మార్కెట్ ధర ప్రకారం దీని విలువ సుమారు ₹11,13,077 రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. బియ్యం రవాణాకు సంబంధించిన ఎలాంటి చట్టబద్ధమైన పత్రాలు నిందితుల వద్ద లేవని విచారణలో తేలింది. ఇంత భారీ మొత్తంలో బియ్యం బీహార్ నుండి ఇక్కడికి ఎలా వస్తోంది? దీని వెనుక ఉన్న సూత్రధారులెవరు? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

విచారణ అనంతరం కఠిన చర్యలు

ఈ ఘటనపై అల్లాదుర్గం ఎస్సై శంకర్ మాట్లాడుతూ.. అక్రమ బియ్యం రవాణాపై పక్కా సమాచారంతో దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే సివిల్ సప్లయ్ అధికారులకు తెలియజేశామని, వారి సమక్షంలో పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అక్రమ రవాణాకు పాల్పడే వారిపై నిఘా ఉంచామని, ఇలాంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Siva Prasad

రచయిత గురించి

Siva Prasad

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.