వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి శుక్రవారం తిరుపతి (Tirupati)ఈస్ట్ పోలీస్ స్టేషన్‌కి విచారణ కోసం హాజరయ్యారు. ఇటీవల అలిపిరి సమీపంలో ఒక విగ్రహం పడివుండటం సంఘటనపై ఆయన చేసిన వ్యాఖ్యలతో వివాదం నెలకొంది. ఈ ఘటనపై ఆయన ప్రభుత్వాన్ని మరియు టీటీడీ అధికారులను విమర్శిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు.
విగ్రహంపై వివాదం
భూమన చేసిన వ్యాఖ్యలపై అధికార ప్రభుత్వం స్పందిస్తూ, భూమన చూపిన విగ్రహం విష్ణువ శనీశ్వరుడిది అని స్పష్టం చేసింది. ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి (Bhanuprakash Reddy)కూడా ఇదే విషయాన్ని తెలియజేశారు. ఈ ప్రకటనల అనంతరం భూమనపై కేసు నమోదు కాగా, పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు.
పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత – ఎంపీ గురుమూర్తికి అనుమతి నిరాకరణ
విచారణకు హాజరైన సమయంలో తిరుపతి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. భూమనకు మద్దతుగా వెళ్లిన తిరుపతి ఎంపీ గురుమూర్తిని పోలీసులు నిలిపివేశారు. స్టేషన్‌లోకి అనుమతించకుండా ఆయనను ఆపారు. దీంతో వైసీపీ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ముందస్తు భద్రత చర్యలు – కార్యకర్తలకు ఎంట్రీ నిషేధం
పోలీసులు ముందస్తుగా చర్యలు తీసుకుని, భారీ భద్రత ఏర్పాటు చేశారు. స్టేషన్‌కు వచ్చే మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి, వైసీపీ కార్యకర్తలు మరియు ఇతరులకు ప్రవేశాన్ని నిరాకరించారు. ఎలాంటి ఆందోళనలు జరగకుండా చూసేందుకు సన్నద్ధతతో వ్యవహరించారు.
“ధర్మ పరిరక్షణ కోసం చేసిన వ్యాఖ్యలకే కేసులు”: వైసీపీ ఆరోపణ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించాలన్న ఉద్దేశంతో భూమన స్పందించారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లినందుకు కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తప్పుడు కేసులతో వేధింపులకు గురి చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: