తిరుపతిలోని అలిపిరి ఓల్డ్ చెక్‌పాయింట్ వద్ద విగ్రహం వ్యవహారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ చర్చకు కారణమవుతోంది. ఈ ఘటనపై అధికార, విపక్ష పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు వేగంగా జరుగుతున్నాయి. ప్రతి పార్టీ తన దృష్టికోణంలో సమస్యను ప్రస్తావిస్తూ మరొకరిపై తీవ్ర విమర్శలు పెడుతోంది. ఈ రాజకీయ వేగంలోనే వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కీలక పాత్రలో నిలిచారు.
విగ్రహం పైన చేసిన ఆయన వ్యాఖ్యలపై అలిపిరి పోలీసులు స్పందించారు. విగ్రహాన్ని నిర్లక్ష్యంగా వదిలేశారు అని, భూమన కరుణాకర్ (Bhumana Karunakar Reddy) చేసిన వ్యాఖ్యలపై ఆయన మీద కేసు నమోదైంది.ఈ నేపథ్యంలోనే భూమన కరుణాకర్ రెడ్డికి 41ఏ నోటీసులు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే అలిపిరి పోలీసులు భూమన కరుణాకర్ రెడ్డికి 41ఏ నోటీసులు ఇచ్చారు.గురువారం రోజున తిరుపతి డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ భూమన కరుణాకర్ రెడ్డికి నోటీసులు అందించారు.
కారు పార్కింగ్ సమీపంలో విగ్రహాన్ని నిర్లక్ష్యంగా పడేశారని
అయితే తనకు కొన్ని రోజులు పనులు ఉన్నాయని.. సెప్టెంబర్ 23వ తేదీన విచారణకు వస్తానని భూమన కరుణాకర్ రెడ్డి పోలీసులకు చెప్పినట్లు తెలిసింది.మరోవైపు తిరుపతిలోని అలిపిరి ఓల్డ్ చెక్ పోస్టు (Alipiri Old Check Post) వద్ద ఉన్న కారు పార్కింగ్ సమీపంలో విగ్రహాన్ని నిర్లక్ష్యంగా పడేశారని.. ఇది శ్రీమహావిష్ణువు విగ్రహం అంటూ భూమన కరుణాకర్ రెడ్డి మంగళవారం ఆరోపించారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించిన టీటీడీ ఛైర్మన్, పాలకమండలి సభ్యులు వెంటనే రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు.
అయితే అది శ్రీమహావిష్ణువు విగ్రహం కాదని.. శనీశ్వరుడి విగ్రహమని, తయారీలో లోపం తలెత్తటంతో శిల్పి అక్కడే వదిలేశారంటూ టీటీడీ (TTD), ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం క్లారిటీ ఇచ్చాయి. ఈ క్రమంలోనే భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ టీటీడీ డిప్యూటీ ఈవో గోవిందరాజు (TTD Deputy EO Govinda raju) అలిపిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: