ఆధునిక కాలంలో కొందరి ప్రవర్తన చిత్రవిచిత్రంగా ఉంటుంది. వారు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో.. ఎలా మసలుకుంటారో తెలియదు. ఉన్మాదం నెత్తిన ఎక్కితే ఎంతటి కిరాతకానికైనా దిగజారిపోతారు. తాజాగా(Bhimavaram crime) ఓ వ్యక్తి తన తల్లిని, తమ్ముడిని కిరాతకంగా హతమార్చాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read also: జూబ్లీహిల్స్ లో కొనసాగుతున్న పోలింగ్
చంపి అనంతరం పోలీసులకు ఫోన్
పశ్చిమగోదావరి జిల్లా(West Godavari) భీమవరం సుంకర పద్దయ్య వీధిలో నివాసం ఉంటున్న శ్రీనివాస్ (37) దెయ్యాలంటూ తల్లి మహాలక్ష్మి(60), తమ్ముడు రవితేజ (33)లను చాకుతో దారుణంగా పొడిచి చంపాడు. అనంతరం(Bhimavaram crime) నిందితుడు శ్రీవివాస్ పోలీసులకు ఫోన్ చేసి మరి చెప్పాడు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి, నిందితుడి అదుపులోకి తీసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read also: