📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు

Bhavya Sri: మెట్ల పైనుంచి జారిపడి కళాకారిణి దుర్మరణం

Author Icon By Tejaswini Y
Updated: December 26, 2025 • 11:34 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Kakinada news: పండుగ సందర్భంగా నిర్వహిస్తున్న సాంప్రదాయ నృత్య ప్రదర్శనలకు హాజరైన ఓ యువ నర్తకి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయింది. కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోటి(Shivakoti)లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కుంతలేశ్వరి అమ్మవారి తీర్థ మహోత్సవాల ప్రారంభానికి నాట్య ప్రదర్శనలు ఇచ్చేందుకు వచ్చిన బృందానికి చెందిన 17 ఏళ్ల పాలపర్తి భవ్యశ్రీ(Bhavya Sri) పై అంతస్తు నుంచి జారి పడడంతో తీవ్రంగా గాయపడింది.

Read Also: Mysore Explosion: అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి

Bhavya Sri: Artist dies after falling down stairs

రాజమహేంద్రవరం నుంచి వచ్చిన 12 మంది కళాకారులకు ఆలయానికి ఎదురుగా ఉన్న ఒక మండపంలో వసతి ఏర్పాట్లు చేశారు. ప్రదర్శనకు సిద్ధమవుతూ భవ్యశ్రీ తన గది నుంచి దిగుతూ ఉండగా మెట్లపై నుంచి అదుపుతప్పి కింద పడిపోయింది. తలకు బలమైన గాయం కావడంతో వెంటనే రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి(Died) చెందినట్లు వైద్యులు వెల్లడించారు.

భవ్యశ్రీ ధరించిన ఎత్తైన పాదరక్షల వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తోటి కళాకారులు తెలిపారు. అయితే మెట్లకు సరైన రక్షణ గోడ లేకపోవడమే అసలు కారణమని ఆమె సోదరి పాలపర్తి మధు ఆరోపించారు. నాట్య బృందంలో ఉన్నవారిలో ఎక్కువ మంది మైనర్లే కావడం గమనార్హం. నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులకు మధు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

dancer death festival accident Kakinada news Konaseema District Rajolu mandal Shivakoti temple festival

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.