📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: Bhanuprakash Reddy: పరకామణి చోరీపై రిటైర్డ్ జడ్జితో విచారణ కమిటీ వేయాలి

Author Icon By Sushmitha
Updated: October 27, 2025 • 11:32 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanam) (టీటీడీ) పరకామణిలో జరిగిన డాలర్ల చోరీ వ్యవహారంపై విశ్రాంత న్యాయమూర్తి ఆధ్వర్యంలో విచారణ కమిటీ వేయాలని టీటీడీ మాజీ ఈఓ, విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రమణ్యం కోరారు. ఈ కేసు విచారణ, దాని తదుపరి పరిణామాలపై చర్చించడానికి హైదరాబాద్‌లోని తాజ్ డెక్కన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ డిమాండ్‌ చేశారు.

Read Also: TTD: పరకామణి కేసు పక్కదారి! రాజీలో టిటిడి ప్రమేయం ఉండదా!

లోక్ అదాలత్ రాజీపై అనుమానాలు

2023 ఏప్రిల్ 29న పెద్ద జియ్యంగార్ కార్యాలయం క్లర్క్ రవికుమార్, పరకామణి విధుల్లో ఉండగా 900 డాలర్లను తస్కరించినట్లు టీటీడీ విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ ఫిర్యాదు చేశారు. అయితే, ఇంతటి తీవ్రమైన వ్యవహారం లోక్ అదాలత్‌లో రాజీ కుదరడం, రవికుమార్ తన ఏడు ఆస్తులను టీటీడీకి దానం చేస్తున్నట్లు ప్రకటించడం, ఈ అంశాన్ని టీటీడీ ముందుగా పత్రికల్లో ప్రచురించకపోవడం వంటివన్నీ అనుమానాస్పదంగా ఉన్నాయని ఎల్‌వీ సుబ్రమణ్యం అన్నారు.

పాట్నా హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నరసింహారెడ్డి మాట్లాడుతూ, “రూ.100 కోట్లు ఉన్న వ్యక్తి టీటీడీలో క్లర్క్‌గా ఎందుకు పని చేస్తారు?” అని ప్రశ్నించారు. రవికుమార్ దానం చేసిన రూ.14 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయనే అంశంపై విచారణ జరగలేదని ఆయన పేర్కొన్నారు.

పోరాటం, బెదిరింపులు

టీటీడీ బోర్డు సభ్యుడు జి. భానుప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ, ఈ డాలర్ల చోరీ తదనంతర పరిణామాలపై న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. ఈ సమావేశాన్ని అడ్డుకోవడానికి చాలా బెదిరింపు సందేశాలు వచ్చాయని, తనపై ఎంతో ఒత్తిడి తీసుకొస్తున్నారని చెబుతూ ఆయన ఉద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు. చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్ మాట్లాడుతూ, ఈ సంఘటన బాధాకరమని, బాధ్యులను శిక్షించాలని అన్నారు. తనికెళ్ల సత్య రవికుమార్ మాట్లాడుతూ, పరకామణిలో జరిగింది దొంగతనం కాదని, స్వామి ద్రోహం అని అభివర్ణించారు.

పరకామణి చోరీ కేసు విచారణకు ఎవరు డిమాండ్ చేశారు?

టీటీడీ మాజీ ఈఓ, విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎల్‌వీ సుబ్రమణ్యం డిమాండ్ చేశారు.

దొంగిలించినట్లు గుర్తించిన డాలర్లు ఎన్ని?

రవికుమార్ 900 డాలర్లను తస్కరించినట్లు గుర్తించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

CBI Lakshminarayana. Google News in Telugu Judicial inquiry Latest News in Telugu LV Subramanyam Parakamani robbery Telugu News Today tirumala TTD

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.