📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Bhagavad Gita: ప్రతి ఒక్కరి జీవితానికి మార్గదర్శి, ధర్మ స్థాపనకు దిక్సూచి

Author Icon By Saritha
Updated: December 8, 2025 • 11:38 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : భగవద్గీత(Bhagavad Gita) సందేశం మన చర్యలకు మార్గనిర్దేశం చేసి, సమాజాన్ని బలోపేతం చేసి, జాతీయ స్ఫూర్తిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(D.CM Pawan Kalyan) అన్నారు. కన్నడ నాట ఆయనకు అరుదైన గౌరవం లభించింది. ప్రముఖ పుణ్యక్షేతమైన ఉడిపిలో ఆయనకు అభినవ కృష్ణ దేవరాయ అనే బిరుదును ప్రదానం చేశారు. కర్ణాటకలోని ఉడిపి వర్యాయ వుట్టిగే శ్రీకృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో మరాధిపతి సుగుణేంద్ర తీర్థ స్వామీజీ ఈ బిరుదును పవన్ కల్యాణ్కు అందజేశారు.

Read also: బంగారం, వెండి ధరలు తగ్గాయి. డాలర్ బలహీనత…

The Bhagavad Gita is a guide for everyone’s life and a compass for establishing Dharma.

భగవద్గీతే జీవితానికి దిక్సూచి: పవన్ కల్యాణ్

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్(Bhagavad Gita) మాట్లాడుతూ, భగవద్గీత ప్రాముఖ్యత, ధర్మం, తన రాజకీయ ప్రయాణం గురించి కీలక వ్యాఖ్యలు కార్యక్రమానికి తాను ఉప ముఖ్యమంత్రిగానో, ప్రజాసేవకుడిగానో రాలేదని, ధర్మాన్ని అన్వేషించే ఒక వినయపూర్వక సాధకుడిగా మాత్రమే వచ్చానని పవన్ స్పష్టం చేశారు. సరైన పాలన, సేవ, బాధ్యతలతో కూడిన ప్రతి చర్యే నిజమైన నాయకత్వానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు తాను కూడా అర్జునుడిలాంటి సందిగ్ధతను ఎదుర్కొన్నానని గుర్తుచేసుకున్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే రాష్ట్ర సమగ్ర శ్రేయస్సే ముఖ్యమని, ధర్మాన్ని అనుసరించే కేవలం 21 స్థానాలకే పరిమితమయ్యానని వివరించారు. భగవద్గీత అనేది కేవలం ఒకసారి చదివి, ఎర్ర వస్త్రంలో చుట్టి పూజాగదిలో పెట్టే గ్రంథం కాదని పవన్ అన్నారు. జీవితంలో ఎదురయ్యే ప్రతి నిర్ణయంలో, ప్రతి గందరగోళంలో, ప్రతి అంతర్గత పోరాటంలో గీత మనతోనే నడుస్తుందని, మన కురుక్షేత్రాల్లో స్థిరమైన తోడుగా నిలుస్తుందని తెలిపారు. నేటి తరం యువత నిరంతరం సమాచార వెల్లువ, కెరీర్ ఒత్తిడి, గుర్తింపు సంక్షోభం, వైఫల్య భయాలు వంటి ఆధునిక కురుక్షేత్రాలను ఎదుర్కొంటోందని, వారికి అత్యంత అవసరమైన మానసిక బలం, భావోద్వేగ నిలకడను గీత అందిస్తుందని అభిప్రాయపడ్డారు. మన కర్మభూమి ఎన్నో దండయాత్రలను తట్టుకుని నిలబడింది ఆయుధాలు లేదా సంపదతో కాదని, ధర్మాన్ని సజీవంగా ఉంచిన గ్రంథాలు, సంప్రదాయాలు, సాధువులు, పవిత్ర సంస్థల వల్లేనని పవన్ ఉద్ఘాటించారు. శాశ్వత సంరక్షకుడిగా, జగద్గురు మధ్వాచార్యులు తన జ్ఞానంతో ఎందరినో చైతన్యపరిచిన పవిత్ర భూమి ఉడిపి, మన నాగరికతకు ఆత్మలాంటి భగవద్గీత సందేశాన్ని జరుపుకునేందుకు భక్తులతో కలవడం ఆనందంగా ఉంది అని తెలిపారు.

ఉడిపి భారత ఆధ్యాత్మిక హృదయం

ఐన్స్టీన్ నుంచి ఓపెన్హీమర్ వరకు ఎందరో ప్రపంచ మేధావుల ఆలోచనలను గీత శతాబ్దాలుగా ప్రభావితం వేస్తోందని గుర్తు చేశారు. ఉడిపి వంటి పుణ్యక్షేత్రాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు సమావేశమైనప్పుడు వసుధైక కుటుంబం అనే ప్రాచీన భారతీయ దార్శనికతకు జీవం పోస్తారని, ఇదే నేడు ప్రపంచానికి భారత్ అందిస్తున్న సందేశమని వివరించారు. జగద్గురు మధ్వాచార్యుల శాశ్వత వారసత్వం ద్వారా మన ఆధ్యాత్మిక సంపదను కాపాడిన వారిని స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. శ్రీకృష్ణుడు కొలువైన, ముఖ్యప్రాణ హనుమంతుడు సుగుణేంద్ర తీర్థ స్వామీజీ దార్శనిక మార్గదర్శకత్వంలో ఈ పవిత్ర భూమి చారిత్రక ఆధ్యాత్మిక ఉద్యమాలకు సాక్షిగా నిలుస్తోందని పవన్ ప్రశంసించారు. కోటి భగవద్గీత చేతిరాత ప్రాజెక్టు నుంచి లక్ష కంఠ పారాయణం వరకు చేపట్టిన కార్యక్రమాలు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తున్నాయని కొనియాడారు. ఈ పవిత్ర భూమి భారతదేశపు ఆధ్యాత్మిక శక్తి కేంద్రమని ఆయన అభివర్ణించారు. శ్రీకృష్ణుడు నిత్యం కొలువై ఉండే ఈ నేలపై అడుగుపెట్టడం తన అదృష్టమని పేర్కొన్నారు. బృహత్ గీతోత్సవం శుభ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు కోరుకోవడానికి ఇక్కడికి వచ్చానని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

AndhraPradesh BhagavadGita DeputyCM Geetotsava Hinduism Madhvacharya PawanKalyan Politics Spirituality Telugu News Udupi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.