📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం బస్సు బోల్తా ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం బస్సు బోల్తా ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు

BC Reservation : గ్రామ రాజకీయాల్లో బీసీల దూకుడు!

Author Icon By Sudha
Updated: January 2, 2026 • 4:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో ఇటీవల ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ఒక స్పష్టమైన రాజకీయ సందేశాన్ని ఇచ్చా యి. ఇవి కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రమే కాదు సామాజిక న్యాయం, రాజకీయ సాధికారత అంశాలపై ప్రజ లు ఇచ్చిన తీర్పు. ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న పోరా టం 42శాతం బీసీ రిజర్వేషన్ (BC Reservation) విధానం ఎంత ప్రభావ వంతమో ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టంగా చాటిచెప్పాయి. రిజర్వేషన్ అంటే అవకాశాల పరిమితి అన్న అపోహను ఈ ఎన్నికలు పూర్తిగా ఖండించాయి. బీసీలకు రిజర్చేస్తామన్న పార్టీపరంగా చేసిన సీట్లు 42శాతమే అయినప్పటికీ, జనరల్ సీట్లలో బీసీ అభ్యర్థులు సుమారు 56శాతం సీట్లు గెలుచుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన పరిణా మం. ఇది బీసీలు ఇకపై కేవలం రిజర్వ్ సీట్లకే పరిమితం కాదన్న స్పష్టమైన సంకేతం. మొత్తం 12,707 గ్రామ పం చాయతీల్లో ఎన్నికలు జరగగా, బీసీ రిజర్వేషన్ ద్వారా 2,275 సీట్లు, జనరల్ కేటగిరీ 5,190 సీట్లలో 2,738 సీట్లు బీసీ అభ్యర్థులే గెలుచుకున్నారు. మొత్తంగా 5,013 బీసీ సర్పంచులు ఎన్నికై, రాష్ట్రవ్యాప్తంగా 45.25 శాతం నమోదు చేశారు. జిల్లాలవారీగా చూస్తే బీసీల రాజకీయ బలం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. పెద్దపల్లి జిల్లాలో 63 శాతంతో బీసీల విజయం అత్యధికంగా నమోదైంది. మొత్తం 18 జిల్లాల్లో బీసీల గెలుపు 50శాతం మించింది. ఇది గ్రామీణ రాజకీయాల్లో బీసీలు కేంద్ర శక్తిగా ఎదిగిన దానికి నిదర్శనం. ఈ ఫలితాలు ఓటర్ల తీర్పులో వచ్చిన మార్పును కూడా సూచిస్తున్నాయి. ఓటర్లు ఇక కేవలం కుల గుర్తింపులకే పరిమితం కావడం లేదు. పని తీరు, అను భవం, ప్రజలతో అనుబంధం ఆధారంగా తీర్పు ఇస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య పరిపక్వతకు ఆరోగ్యకరమైన సూచన.

Read Also: http://TS UTF: కొత్త యేడాదిలోనైనా సర్వీసు నిబంధనలు రూపొందించాలి

BC Reservation

సమాజాన్ని విభజించలేదు

రిజర్వేషన్ వల్ల ప్రతిభ తగ్గుతుంది అన్న వాదనకు ఈ ఎన్నికలు గట్టి సమాధానం ఇచ్చాయి. రిజర్వేషన్ = అవకాశం, అవకాశం = అనుభవం, అనుభవం పోటీ సామర్థ్యం ఈ సహజ క్రమమే బీసీలను జనరల్ రాజకీయ పోటీలో ముందుకు నడిపించింది. మొత్తంగా చెప్పాలంటే, తెలంగాణ పంచాయతీ ఎన్నికలు ఒక విషయాన్ని స్పష్టంగా నిరూపించాయి. బీసీ రిజర్వేషన్ (BC Reservation) సమాజాన్ని విభజించలేదు, రాజకీయాలను మరింత సమగ్రంగా మార్చింది. గ్రామ పాల నలో బీసీలు ఇక అనివార్య రాజకీయ శక్తిగా మారారని ఈ ఎన్నికలు చాటిచెప్పాయి. సామాజిక న్యాయం కోసం పున రుద్ధరింస్తున్న బీసీ ఉద్యమం గ్రామాల నుండి రాష్ట్రానికి పునర్నిర్మిస్తున్న సామాజిక న్యాయ పోరాటం ఇది. తెలంగా ణలో బీసీ వర్గాలు 42 శాతం రిజర్వేషన్ల కోసం కొత్త స్థాయి లో ఉద్యమం మొదలుపెట్టాయి. జనాభా నిష్పత్తి, ఆర్థిక వెనుకబాటు, విద్యాలోపాలు, రాజకీయ ప్రాతినిధ్యం ఇవన్నీ కలిసి ఈ డిమాండ్కు బలమైన ఆధారాలుగా నిలుస్తున్నా యి. ఈ డిమాండ్ ఇప్పుడు కేవలం రాజకీయ నినాదం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రజాఉద్యమం రూపం దాల్చు తోంది. బీసీ రిజర్వేషన్లకు శాశ్వత రక్షణ కల్పించాలంటే, తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుని 9వ షెడ్యూల్లో చేర్చ డం తప్పనిసరి. ఇది కోర్టుల జోక్యాన్ని తగ్గించి, రిజర్వే షన్లను శాశ్వతంగా నిలబెడుతుంది. ఈ దిశగా బీసీ కమిషన్ బలోపేతం, నిర్వహణ, డేటా ఆధారిత సమగ్ర నివేదికలు అవసరం.

గ్రామం మారితేనే రాష్ట్రం మారుతుంది

తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఈ ఉద్యమానికి అపూర్వ అవకాశంగా కనిపిస్తున్నాయి. గ్రామ స్థాయి బిసి నాయకత్వం బలపడితే స్థానిక పాలనలో బీసీల నిర్ణయాధికారం పెరుగుతుంది, అనే దానికి ఊపు ఇచ్చింది. జిల్లా-మండల స్థాయిలో బిసిప్రభావం పెరుగుతుంది, 42 శాతం రిజర్వేషన్ల ఉద్యమానికి నేలస్థాయి బలం ఏర్పడు తుంది అనే దానికి నిదర్శనం. గ్రామం మారితేనే రాష్ట్రం మారుతుంది” అనేమాట ఈ సందర్భంలో మరింత ప్రాముఖ్యం సంతరించుకుంది. 42 శాతంబీసీ రిజర్వేషన్ల డిమాండును అమలు చేయాలంటే తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానంచేసినా, పార్లమెంటులో అన్ని పార్టీల మద్దతు కావాలి. జాతీయ స్థాయి బిసి సంఘాలలో డిమాండ్ ఒక పార్టీది కాదు. ఇది రాష్ట్ర ప్రజా డిమాండ్గా మారాలి.కులసంఘాల ఐక్యతే ఈ పోరాటానికి శక్తి, తొలిసారి బీసీలలో వందలాది కులాలు ఒకే వేదికపైకి వస్తున్నాయి. బీసీ జేఏసీ, విద్యార్థి సంఘాలు, ఉద్యోగి సంఘాలు, మహిళా సంఘాలు కలిసి రాష్ట్రవ్యాప్తంగా యాత్రలు, అవ గాహన సదస్సులు, శాంతియుత ధర్నాలు నిర్వహిస్తున్నా యి. ప్రతి గ్రామం ఒక బీసీ హక్కుల కేంద్రంగా మారా ల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.

BC Reservation

డిజిటల్ ప్లాట్ఫార్మ్

నేటి రాజకీయాల్లో డేటా శక్తి, మీడియా శక్తి అత్యంత కీలకమైంది. బీసీల జనాభా, విద్యా శాతం, గ్రామస్థాయి ప్రాతినిధ్యంపై సమగ్ర డాక్యుమెంట్లు, ఇన్ఫోగ్రాఫిక్స్, చిన్న వీడియోలు ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు. యువత బిసి ఉద్యమాన్ని డిజి టల్ ప్లాట్ఫార్మ్ ముందుకు తీసుకెళ్తున్నారు. డేటా సేక రణ, చట్టపరమైన ముసాయిదాలు ప్రజా ఉద్యమ పర్వం, జాతీయ మద్దతు విస్తరణ, అమలు, స్థిరీకరణ, స్థానిక సంస్థ ల్లో బీసీ ప్రాతినిధ్యం బలపరచడం. ఈ మూడు సంవత్స రాలు బీసీ సామాజిక పునర్నిర్మాణానికి కీలకంగా మారబో తున్నాయి. తెలంగాణలో బీసీల 42 శాతం రిజర్వేషన్ డిమాండ్ రాజ్యాంగ హక్కుల పోరాటం మాత్రమే కాదు అది తరతరాలుగా అణగారిన వర్గాల సామాజిక స్వాభిమాన యాత్ర. గ్రామంలోని బిసి ఓటు గ్రామంలోని బిసి నాయ కత్వం, గ్రామంలోని బిసి ఐక్యత ఈ మూడుశక్తులు కలిసి నాయి. ఈ సర్పంచ్ ఎన్నికల్లో రాష్ట్రస్థాయి రిజర్వేషన్ ఉద్యమం విజయవంతం అవుతుంది. బీసీల్ ప్రాతినిధ్యం పెరగడం అంటే సామాజిక న్యాయం బలపడటం..
-డాక్టర్ చలమల్ల వెంకటేశ్వర్లు

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Backward Classes BC Reservation Breaking News latest news Rural Politics Social Justice Telugu News village politics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.