పేదలు, మధ్యతరగతి కుటుంబాలు, సామాన్య ప్రజలపై పడుతున్న విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి(BC JanardhanReddy) స్పష్టం చేశారు. ప్రజలకు అదనపు ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
Read also: AP: త్వరలో అన్ని విషయాలు మాట్లాడతా: సీఎం చంద్రబాబు
ఇప్పటివరకు వినియోగదారులపై వేయాల్సిన విద్యుత్ ట్రూ అప్ ఛార్జీల భారాన్ని ప్రభుత్వం స్వయంగా భరిస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా ట్రూ అప్ ఛార్జీల పెంపు తప్పనిసరి పరిస్థితి ఉన్నప్పటికీ, ప్రజలపై మరింత భారం మోపకూడదన్న ఉద్దేశంతో ఏపీఈఆర్సీ (APERC) ప్రతిపాదనలను ప్రభుత్వం తిరస్కరించిందని మంత్రి(BC JanardhanReddy) వెల్లడించారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నిర్ణయాలు తీసుకుంటూ, అవసరమైతే ప్రభుత్వమే ఆర్థిక భారాన్ని మోయడానికి సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: