BC Janardhan Reddy: పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

Read Time:  1 min
BC Janardhan Reddy: పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం
FONT SIZE
GET APP

BC Janardhan Reddy: జువ్వెలదిన్నె పిషింగ్ హార్బరు ప్రవేట్ పరం చేస్తున్నామంటూ ప్రతిపక్షం చేస్తున్న విమర్శల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని రాష్ట్ర మంత్రి బి. జనార్ధన్రెడ్డి కొట్టిపారేశారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్లో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ్ మంత్రి కొల్లు రవీంద్రతో కలసి నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో ఇరువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ సిఎం జగన్ దుర్మార్గాలపై ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఇరువురు మంత్రులు ప్రజలకు పిలుపునిచ్చారు. జువ్వలదిన్నె అభివృద్ధిపై జగన్రెడ్డి కుట్రలు సిగ్గుచేటన్న మంత్రులు, రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

Read Also: Land Registration Rules: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ సులభం

BC Janardhan Reddy: పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం
BC Janardhan Reddy: Unable to stomach the inflow of investments, YCP resorts to malicious propaganda.

జువ్వలదిన్నె హార్బర్ వాస్తవాలు

మంత్రి బిసి జనార్ధన్రెడ్డి మాట్లాడుతూ జువ్వలదిన్నె పిషింగ్ హార్బర్ను ప్రైవేట్ పరంగా చేస్తున్నారన్న వార్తలు పూర్తిగా అవాస్తవమన్నారు. మొత్తం 114 ఎకరాల 13 సెంట్ల హార్బర్ భూమిలో కేవలం 7 ఎకరాలు మాత్రమే సాగర్ డిఫెన్స్ లిమిటెడు కేటాయించడం ఇంజనీరింగ్ ఆధునిక సమాచారం జరిగిందన్నారు. మత్స్యకారులకు కమ్యూనికేషన్, వాతావరణ అందించేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని తెలిపారు.

ఉపగ్రహాలు, డ్రోన్లు, ఆధునిక టెక్నాలజీ ద్వారా సముద్రంలో ఉన్న మత్స్యకారులకు అదనపు సమాచారం అందనుందన్నారు. రాష్ట్ర ప్రగతిని అడుకుంటామంటే ఉపేక్షించేందేది లేదు: మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ జువ్వలదిన్నె హార్బర్ వద్ద అటానమస్ మారిటైం షిప్ యార్డు నిర్మాణంపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పబోవని మంత్రి హెచ్చరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక పారిశ్రామిక ప్రగతి దిశగా కీలకమైన అడుగులు వేస్తున్నాం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25.03 శాతం ఏపికి రావడం కూటమి పాలనకు నిదర్శనం అన్నారు.

మత్స్యకారలు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది

మత్స్యకారలు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: గత ఐదు సంవత్సరాల పాటు వేటకు వెళ్ళి మరణించిన మత్స్యకారులకు పైసా చెల్లించలేదు. కానీ కూటమి అధికారంలోనికి రాగానే 95మందికి రూ.4.75కోట్లు చెల్లించాం. మత్స్యకారుల అభివృద్ధికి చిత్తశుద్దితో పనిచేశాం. మత్స్య రంగానికి తోడ్పాటు అందించేలా పరిశ్రమల్ని తీసుకొచ్చి నిలుస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా మత్స్యకారులను పారిశ్రామికంగా తోడుగా అండగా నిలుస్తున్నాం. అలాంటి ప్రబుత్వంపై విమర్శలు చేయడానికి జగన్ వారి ముఠా కాసైనా సిగ్గుపడాలని మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.