విజయవాడ : రాష్ట్రంలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్(Battery Energy) విద్యుత్ సాంకేతికత వినియోగంలోకి రానున్నట్లు ఇంధనశాఖ వెల్లడించింది. 2,000 మెగావాట్ అవర్ (1000 మెగావాట్ల సామర్థం ఉన్న యూనిట్ల ద్వారా ఉదయం, సాయంత్రం రెండు గంటల చొప్పున విద్యుత్ నిల్వ) బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఇంధన శాఖ టెండర్లు ఖరారు చేసింది. మెగావాట్కు నెలకు సగటున రూ.1,58,575 చొప్పున అతి తక్కువ రేటును గుత్తేదారులు కోట్ చేశారు.
Read Also: AP: నేడు పాస్టర్ల ఖాతాల్లోకి రూ.5వేలు
రాష్ట్రంలో ఏడు ప్రాంతాల్లో వీటి ఏర్పాటుకు ఆ శాఖ ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా నిల్వ చేసిన విద్యుత్ 12 ఏళ్ల పాటు అందుబాటులో ఉంటుంది. దీనివల్ల పీక్ డిమాండ్ సమయంలో యూనిట్ విద్యుత్ రూ.4.38కే లభిస్తుంది. సుమారుగా ఏడాది కాలంలో ఇవి అందుబాటులోకి రావచ్చని అంచనా.! రాష్ట్రంలో ఏర్పాటు చేసే ప్రాజెక్టుల ద్వారా 12 ఏళ్ల పాటు సేవలు అందుతాయని సంబంధిత అధికారులు తెలుపుతున్నారు. వీటి ద్వారా 95 శాతం విద్యుత్ నిల్వ సామర్థం అందుబాటులో ఉంటుందని అంచనా వేస్తున్నారు.
యూనిట్ విద్యుత్ నిల్వకు(Battery Energy) సగటున రూ.1.68 చొప్పున ఖర్చు అవుతుందని అధికారులు లెక్కలు తేల్చారు. నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ నిర్వహించే బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టుల ద్వారా యూనిట్ విద్యుత్ నిల్వకు రూ. 2.15 చొప్పున ఖర్చు అవుతోందని నిపుణులు వివరిస్తున్నారు. ఈ లెక్కన రాష్ట్రంలో ఏర్పాటు చేసే 1,000 మెగావాట్ల ప్రాజెక్టులో నిల్వ చేసే విద్యుత్ ద్వారా రూ.910 కోట్లు ఆదా అవుతుందని అధికారులు లెక్కలు వేశారు. పీక్ డిమాండ్ సమయంలో ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో రూ.10 చొప్పున డిస్కంలు కొంటున్నాయి. దీనివల్ల కొనుగోలు వ్యయం పెరిగి వినియోగదారులపై ట్రూఆప్ భారం పడుతోంది.
బ్యాటరీ ప్రాజెక్టుల ఏర్పాటుతో విద్యుత్ కొనుగోలు వ్యయం భారీగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఉదయం పీక్ డిమాండ్ సమయంలో రెండు గంటలు, సాయంత్రం పీక్ డిమాండ్ వేళల్లో రెండు గంటల చొప్పున బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్ వినియోగించుకోవాలని అధికారులు భావిస్తున్నారు. పీక్ డిమాండ్ సమయంలో యూనిట్ విద్యుత్ రూ.4.38 ధరకు అందుబాటులోకి వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టులకు యూనిట్కు చెల్లించే స్థిర ఛార్జీలు రూ.1.68, యూనిట్ విద్యుత్ కొనుగోలుకు రూ.2.70 చొప్పున (మైలవరం సౌర ప్రాజెక్టు ద్వారా యూనిట్ రూ.2.70 చొప్పున అందుతుంది) డిస్కంలు చెల్లిస్తాయి.
రాష్ట్ర విద్యుత్ రంగంలో కొత్త సాంకేతికత అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు సౌర, పవన, పంప్డ్ స్టోరేజి విద్యుత్ ప్రాజెక్టులు మాత్రమే ఉండగా ఇకపై బ్యాటరీ స్టోరేజి విద్యుత్ ప్రాజెక్టులూ ఏర్పాటు కానున్నాయి. ఏపీలో వెయ్యి మెగావాట్ల నిల్వ సామర్థంతో వాటిని నెలకొల్పేందుకు కేంద్రం అనుమతించింది. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా నాలుగుచోట్ల ఆయా ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: