📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్

Latest news: Bapatla crime: బాపటల్లో రోడ్డు ప్రమాదం.. స్పాట్ లోనే ఇద్దరు యువకులు దుర్మరణం

Author Icon By Saritha
Updated: November 6, 2025 • 2:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వేగం కన్నా ప్రాణం మిన్న..స్పీడ్ ట్రీల్స్..బట్ లైఫ్ కిల్.. ఇలాంటి స్లోగన్లను పోలీసులు రోడ్డుపై పెడుతూనే ఉంటారు. వాహనదారుల భద్రత కోసం ఎన్నో కోట్లను ఖర్చుపెట్టి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటున్నా.. ప్రమాదాలు ఆగడం లేదు.. ప్రాణాలు దక్కడం లేదు. నిర్లక్ష్యం.. వేగం.. నిద్రమత్తు.. మద్యంమత్తు కారణాలు ఏవైనా పోయేది ప్రాణాలే కదా. ఆ కుటుంబాలకు అంతులేని

దుఃఖమే కదా మిగిలేది. బాపట్ల పట్టణంలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు(Bapatla crime) ప్రమాదం చోటు చేసుకుంది. పట్టణంలోని క్లాక్ టవర్ కూడలి వద్ద అతివేగంగా దూసుకొచ్చిన ఓ బైక్ లారీని ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Read also: దుల్కర్ సల్మాన్ ‘కాంత’ ట్రైలర్ రిలీజ్

Bapatla crime: బాపటల్లో రోడ్డు ప్రమాదం.. స్పాట్ లోనే ఇద్దరు యువకులు దుర్మరణం

గాల్లో ఎగిరి రోడ్డుపై పడి, దుర్మరణం

గుంటూరు జిల్లా(Guntur District) కొరిటపాడుకు చెందిన షేక్ రిజ్వాన్ (21), చింతల నాని (21) స్నేహితులు. వీరిద్దరూ బుధవారం రాత్రి బైక్ పై సూర్యలంక బీచ్ కు వెళ్లారు. అయితే, బీచ్ మూసి ఉండటంతో తిరిగి గుంటూరుకు తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో అర్థరాత్రి 2.34గంటల సమయంలో బాపట్ల గడియారం స్తంభం కూడలి వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో చీరాల నుంచి గుంటూరు వైపు వెళుతున్న ఓ లారీని(Bapatla crime) వీరి బైక్ బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బైక్ పై ఉన్న ఇద్దరు యువకులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు. తీవ్ర గాయాలు కావడంతో ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. ఈ ప్రమాఆనికి బైక్ అతివేగమే కారణమని తెలుస్తోంది. ఈ దుర్ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమాచారం అందుకున్న పోలలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుల నిర్లక్ష్య డ్రైవింగ్ తో ప్రాణాలు కోల్పోయిన రెండు కుటుంబాల తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చారు. చిన్న జాగ్రత్త పెద్ద ప్రాణాలు రక్షించబడతాయి. ఈ చిన్న నిర్లక్ష్యం ఖరీదు వెలకట్టలేనంతది.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Bapatla bike-lorry-collision cctv-footage fatal-accident guntur-district Latest News in Telugu road-accident speeding Telugu News traffic-safety youth-death

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.