📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు పోలీసుల ఎదుటే వ్యక్తి దారుణ హత్య బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు పోలీసుల ఎదుటే వ్యక్తి దారుణ హత్య బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్

Bapatla: పూరిగుడిసె దగ్ధం.. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

Author Icon By Tejaswini Y
Updated: January 3, 2026 • 4:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బాపట్ల(Bapatla) జిల్లా మార్టూరు మండలం జొన్నతాళి గ్రామంలో నివసిస్తున్న చిట్టి బోయిన అంజయ్య, వెంకయమ్మ దంపతుల పూరి గుడిసె అగ్నిప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇంట్లోని సామగ్రి, బట్టలు, నిత్యావసర వస్తువులు పూర్తిగా కాలిపోయి, కుటుంబం అన్నిటినీ కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

Read also: Kethireddy: యుద్ధం ముగిసిందని తెలియదు: మాజీ ఎమ్మెల్యే

ఈ విషయం తెలుసుకున్న మార్టూరు హెల్పింగ్ హాండ్స్(Helping Hands Martur) స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు పఠాన్ ఖాదర్ వలి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు వెంటనే స్పందించారు. బాధిత కుటుంబానికి ఆర్థికంగా చేయూతనివ్వాలనే ఉద్దేశంతో రూ.10 వేల నగదు సహాయంతో పాటు బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని వారు హామీ ఇచ్చారు.

Bapatla: Puri hut burnt down.. Financial assistance to the victim’s family

అగ్నికి ఆహుతైన కుటుంబానికి రూ.10 వేల సాయం

అదేవిధంగా, మార్టూరు మండలంలోని రాజుపాలెం అసిస్ట్ కాలనీకి చెందిన గుంజి నాగేంద్రమ్మ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండటంతో, ఆమె వైద్య ఖర్చులకు తోడ్పాటుగా మరో రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని హెల్పింగ్ హాండ్స్ సంస్థ అందజేసింది. ఆర్థిక ఇబ్బందులతో చికిత్స తీసుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్న ఆమెకు ఈ సహాయం ఎంతో ఊరట కలిగించిందని స్థానికులు పేర్కొన్నారు. మార్టూరు హెల్పింగ్ హాండ్స్ సంస్థ సమాజ సేవకు ఎప్పుడూ ముందుంటుందని, పేదలు, బాధితుల కోసం ఇలాంటివి మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ సేవా కార్యక్రమానికి గ్రామస్తులు ప్రశంసలు కురిపించారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Bapatla district news Fire accident hut Helping Hands Martur Martur mandal Poor family help Social Service

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.