📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Bank Holidays 2026: బ్యాంక్ సెలవుల జాబితా విడుదల

Author Icon By Saritha
Updated: December 27, 2025 • 6:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆర్బీఐ 2026 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ (Telangana) రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవుల జాబితాను అధికారికంగా విడుదల చేసింది. (Bank Holidays 2026) బ్యాంకు లావాదేవీలు జరిపే కస్టమర్లు ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని తమ పనులను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచించింది. జాతీయ సెలవులతో పాటు, ప్రాంతీయ పండుగల కారణంగా కొన్ని సెలవు దినాల్లో రెండు రాష్ట్రాల (Bank Holidays 2026) మధ్య స్వల్ప తేడాలు ఉన్నాయి. ప్రతి నెలా రెండో, నాలుగో శనివారాలు, అన్ని ఆదివారాలు బ్యాంకులకు సాధారణ సెలవులు కాగా, వాటికి అదనంగా ఈ సెలవులు వర్తిస్తాయి. ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం సెలవు రోజుల్లోనూ నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయి. 2026లో దీపావళి నవంబర్ 8న ఆదివారం రావడం గమనార్హం.

Read Also: IT Sector: H-1B కఠిన నిబంధనలు.. భారత్ ఐటీ రంగానికి లాభమా?

The list of bank holidays has been released.

తెలుగు రాష్ట్రాల్లో 2026 బ్యాంక్ సెలవుల జాబితా

జనవరి 15: మకర సంక్రాంతి, జనవరి 26: గణతంత్ర దినోత్సవం, మార్చి3: హోలీ, మార్చి 19: ఉగాది, మార్చి 20: రంజాన్ (ఆంధ్రప్రదేశ్‌), మార్చి 21: రంజాన్ (తెలంగాణ), మార్చి27: శ్రీరామ, నవమి, ఏప్రిల్1: వార్షిక ఖాతాల ముగింపు, ఏప్రిల్ 3: గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 14: డా. బీఆర్ అంబేడ్కర్ జయంతి, మే1: మేడే, మే27: బక్రీద్, జూన్ 25: మొహర్రం (ఆంధ్రప్రదేశ్‌), జూన్26: మొహర్రం, (తెలంగాణ), ఆగస్టు 15: స్వాతంత్ర్య దినోత్సవం, ఆగస్టు 25: మిలాద్ ఉన్ నబీ (ఆంధ్రప్రదేశ్‌)
ఆగస్టు 26: మిలాద్ ఉన్ నబీ (తెలంగాణ), సెప్టెంబర్ 4: శ్రీకృష్ణ జన్మాష్టమి,సెప్టెంబర్ 14: వినాయక చవితి, అక్టోబర్ 2: మహాత్మా గాంధీ జయంతి, అక్టోబర్ 20:విజయదశమి, నవంబర్ 24: గురునానక్ జయంతి (తెలంగాణలో మాత్రమే), డిసెంబర్ 25: క్రిస్మస్

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh Bank Holidays Bank Holidays 2026 Banking Schedule Latest News in Telugu Public Holidays 2026 RBI holidays Telangana Bank Holidays Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.