దేశంలో మానసిక ఆత్మనియంత్రణ లేకుండా కోపావేశానికి గురవుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకే దాడులు, హత్యలు జరుగుతున్నాయి. ఆవేశం ఒక్కసారిగా హింసగా మారి ప్రాణాలపై దాడి చేసే స్థితికి చేరుకుంటోంది. ఇలాంటి ఘోర సంఘటన తాజాగా బెంగళూరులో చోటుచేసుకుంది.బెంగళూరు (Banglore) లోని ఓ ఆఫీసులో లైట్లు ఆఫ్ చెయ్ అన్నందుకు.. మేనేజర్‌ను చంపేశాడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు.
Read Also: Breaking News – Tragedy : దారుణం.. ముగ్గురిని హత్య చేసి ఆత్మహత్య..ఎక్కడంటే !!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగళూరు (Banglore) గోవిందరాజ్‌నగర్‌లోని MC లేఅవుట్ సమీపంలో ఉన్న డిజిటల్ వాల్ట్ అనే ఫోటో-ఎడిటింగ్ సంస్థలో.. భీమేష్ బాబు అనే 41 ఏళ్ల వ్యక్తి మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ప్రకాశవంతమైన కాంతి భీమేష్ బాబుకు పడదు. అలాంటి కాంతికి బాబు సున్నితంగా ఉంటాడు.
అయితే ఆఫీస్‌లో అనవసరమైన లైట్లు ఆపివేయమని తరచుగా సహోద్యోగులను కోరేవాడు. ఆదివారం (నవంబర్ 2) అర్ధరాత్రి ఒంటి గంట సమయంలోనూ ఆంధ్రప్రదేశ్ (AP) విజయవాడకు చెందిన టెక్నికల్ ఎగ్జిక్యూటివ్ సోమల వంశీ (24) వీడియోలు ఎడిట్ చేస్తున్నాడు. ఆ సమయంలో బాబు.. అతడిని లైట్లు ఆఫ్ చేయాలని చెప్పాడు.
వంశీ బాబుపై కారం పొడి చల్లాడు
దీంతో కోపద్రిక్తుడైన వంశీ.. బాబుతో వాగ్వాదానికి దిగాడు. మాటల యుద్ధం కాస్త మరో స్థాయికి వెళ్లింది. కోపంతో ఊగిపోయిన వంశీ బాబుపై కారం పొడి చల్లాడు. తర్వాత ఇనుప డంబెల్‌తో తల, ముఖం, ఛాతీపై పలుసార్లు కొట్టాడు. బాబు కుప్పకూలిపోవడంతో.. భయాందోళనకు గురైన వంశీ.. నాయందహళ్లిలో ఉన్న తన సహోద్యోగి గౌరీ ప్రసాద్ (Gauri Prasad) ను కలవడానికి బయటకు పరుగెత్తుకుంటూ వెళ్లాడు.
జరిగిన విషయం తెలుసుకున్న ప్రసాద్.. అతడి స్నేహితుడి సహాయం కోరాడు. అనంతరం ఆ ముగ్గురూ ఆఫీసుకు తిరిగి వచ్చారు.మేనేజర్ బాబు (Manager Babu) కదలకుండా ఉండటం చూసి.. వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అయితే అక్కడికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది.. అప్పటికే బాబు చనిపోయాడని ప్రకటించారు.
హత్య నేరం కింద కేసు నమోదైంది
ఈ ఘటన తర్వాత నిందితుడు వంశీ.. గోవిందరాజనగర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. అనతంరం అతడిపై హత్య నేరం కింద కేసు నమోదైంది.లైట్లు ఆఫ్ చేయాలనే విషయంపై వివాదం తలెత్తి.. హత్యకు దారితీసిందని డీసీ (వెస్ట్) గిరీష్ ఎస్ ధ్రువీకరించారు. హత్యకు దారితీసిని ఇంకా ఏమైన కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: