బంగ్లాదేశ్ రగడ రావణ కాష్టంలా రగులుకుం టోంది. 1971 నాటి బంగ్లా విమోచన ఉద్యమంలో పాల్గొన్న వారి వారసులకు ఉద్యోగాల్లో అధిక రిజర్వేషన్లు ఇవ్వడాన్ని అక్కడ విద్యార్థి లోకం తప్పు పట్టింది. రిజర్వేషన్లు వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడానికి బదులు తమకు ఉద్యోగాలు రాకుండా ఇలాంటి కార్యాచరణ చేపట్టడాన్ని నిరుద్యోగ యువకులకు రుచించలేదు. దాంతో వారంతా ఆనాడే తిరుగుబాటు చేశారు. ఆ ఉద్యమంతో బంగ్లా ప్రధాని షేక్ హసీనా పదవీచ్యుతి జరిగింది. ఆపైన భారత్లో ఆమె తలదాచుకోవడంతో తాత్కాలిక ప్రభుత్వ పాలన నోబెల్ గ్రహీత యూనస్ చేతిలోకి వెళ్లింది. ఆతర్వాత అక్కడి పాలన షేక్ హసీనాకు పూర్తి వ్యతిరే కంగా మారింది. అనేక సందర్భాలను వెలికి తీసి ఆమెను అభిశంసించడమే కాకుండా, ఆమె అనుయాయులకు నిద్ర పట్టకుండా చేసింది. కాగా వచ్చే ఫిబ్రవరిలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం తేదీలు నిర్వహించింది. గత ఆగస్టులో విద్యార్థుల ఉద్యమానికి నేతృత్వం వహించిన ఇంక్విలాబ్ మంచ్ నేత ఉస్మాన్ షరీఫ్ హాదీ ఢాకా 8 నియోజక వర్గం నుంచి పోటీ చేయదలచి ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతుండగా ఓ ముసుగు మనిషి అతడిని కాల్చాడు. తీవ్ర గాయమై ఆనక సింగ పూర్ ఆస్పత్రిలో మరణించాడు. షేక్హసీనాకు భారత ప్రభుత్వం ఆశ్రయం కల్పించడం నచ్చని హాదీ ఆది నుంచీ భారత్పై వ్యతిరేక వైఖరితో ఉండేవాడు. కాగా అతను మృతి చెందాడన్న సమాచారంతో ఢాకాలోను, పలు జిల్లాల్లోను హింసాత్మక ఘటనలు జరిగాయి. భారత రాయబార కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. బంగ్లాదేశ్లో పనిలో పనిగా మత విద్వేషాలు కూడా తలెత్తాయి. తాజా దుశ్చర్య భారత్ బంగ్లాదేశ్ మధ్య సత్సంబంధాలను బెడిసికొట్టే పరిస్థితి ఎదురయ్యింది. ఓ అమాయక హిందువుని కొన్ని ఉగ్రవాద ముష్కర మూకలు అతి కిరాతకంగా చంపే శాయి. ఈ ఘటనకు సాకుగా చూపిన అతను ఇస్లాం మత దూషణ చేశాడన్న ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదని ఇన్వెస్టిగేషన్ అధికారులే చెప్పినా దాడులు దారి తప్పాయి. ముందుగా అతన్ని చెట్టుకు కట్టి ఉరి తీసి చంపేశారు. డిసెంబరు 18న మెయిమెన్ సింగ్ ప్రాంతంలోని దీపు చంద్ర దాస్ అనే అతను ఇస్లాం మతాన్ని అవమానించాడంటూ అతడి సహోద్యోగి ఉద్యోగరీత్యా ఉన్న దుగ్ద కొద్దీ నేరాన్ని ఆరోపించాడు. జరగకూడనిది జరిగిపోయింది. ఫ్యాక్టరీలో గొడవ జరుగు తున్న సమయంలోనే దీపును బయటికి పంపడం వల్లే అతనిని వాళ్లు చంపగలిగారు. తదనంతర పరిణామాల్లో దీపూ నిర్దోషిత్వంపై వివరాలు సేకరించి వెల్లడించిన ప్రముఖ పత్రిక ‘డైలీ స్టార్పై ఆందోళన కారులు మళ్లీ ఆగ్రహించారు. ఆ పత్రిక భవనాలను, యంత్రాలను విధ్వంసం చేసారు. అసలీ నిజాలను పాబ్ 14 కంపెనీ కమాండర్ మహమ్మద్ సంసుజమాన్ వెల్లడించగా సదరు వివరాలను ఆ పత్రికలో ఇచ్చారు. పత్రికల ధర్మం. అయినప్పటికీ ఉద్రిక్త వాతావరణంలో ఈ విషయాలనుఅర్థం చేసుకోలేక ఆందోళన కారులు దాష్టీకానికి ఒడిక ట్టారు. దీపూ హత్య జాతీయంగా, అంతర్జాతీయంగా కలకలం రేపింది. ఇలా ఓ అమాయక హిందువుని తప్పుడు ఆరోపణలతోచంపేయడాన్ని ఉత్తర హిందూ ఉత్తర అమెరికా హిందూ కూటమి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బంగ్లాదేశ్ (Bangladesh riot)క్రమేపి ఆటవిక పాలన వైపుగా మరలు తోందని హిందువులపై ఇంతటి దాడులు జరుగుతున్నా అంతర్జాతీయ మీడియా, ప్రపంచ దేశాలు మౌనంగా ఉండటానికి జీర్ణించుకోలేకపోతున్నామని వ్యాఖ్యానిం చింది. ఇది ఇలా ఉంటే బంగ్లాదేశ్ (Bangladesh riot)రాజకీయ సంక్షోభం భారతదేశానికి ముప్పుగా పరిణమిస్తుందని మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజీబ్ బజార్ హెచ్చరిస్తు న్నారు. దేశంలో చాలా ఉగ్రవాదుల శిక్షణా శిబిరాలు ఉన్నాయని వెల్లడించారు. బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహించినట్లు తేదీ విడుదలయ్యాక బంగ్లాలో ఇరు వర్గాల దాడులు మళ్లీ ఊపు అందుకు న్నాయి. హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయని మీడియా స్పష్చేస్తోంది. వాస్తవాలు వెలుగు లోకి తెచ్చారన్న కారణంగా వివిధ పత్రికా సంస్థలపై దాడులు చేసి పత్రికా స్వాతంత్ర్యానికి మచ్చ తెచ్చారు. ఇలా పత్రికా సంస్థలపై దాడులు చేయడం దురదృష్టకరం. ఉన్నది తాత్కాలిక ప్రభుత్వమైనా బంగ్లాదేశ్లో శాంతి భద్రతలను కాపాడడంలో విఫలమవడమే కాదు. కొత్తగా మత విద్వేషాలను కూడా అదుపుచేయలేకపో తోంది. హోదీ మృతి విషయాన్ని తాత్కాలిక ప్రభుత్వ అధినేత మొహమ్మద్ యూనస్ స్వయంగా టీవీలో ప్రక టించారు. ఆ వెంటనే జనం అల్లర్లకు దిగారు. అలాంటి ఉద్వేగాలున్నప్పుడు ఆయనలా చేయకుండా ఉండా ల్సింది. ఆయన సంయమనం పాటించి ఆ విష యాన్ని కొంచెం సర్దుకున్నాక చెప్పి ఉంటే ఇంత తీవ్ర స్థాయిలో అలజడులు జరిగే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఆయన అలా ఆ దిశగా ఆలోచించ లేకపోయారు. జనం జీర్ణించుకోలేని అంశాలను అదిమిపెట్టిఉంచితేనే మేలు. ఇప్పటికైనా యూనస్ ప్రభుత్వం భారతీయుల భద్రత రీత్యా గట్టి చర్యలు తీసుకోవాల్సి ఉంది. సంయమనం పాటించే కృషిచేయాలి. హోదీ హంతకులు భారత్కు వెళ్లిపోయారన్న అపోహ కూడా ఉంది. ఇలాంటి పరిస్థితిలో పాలకుల మోనం మంచిది కాదు. అందుకే భారతీయుల కోసం భారత దౌత్య అధికారులు ప్రత్యేక అడ్వైజరీ ఇవ్వాల్సి వచ్చింది. అటు వైపు నుంచి కూడా బంగ్లా పాలకులు అప్రమత్తమవడం అత్యంత ఆవశ్యకం. ఉభయ దేశాల మధ్య అపోహలు, అనుచిత ప్రవర్తనల పర్యవసానాలు ఉండడం శ్రేయస్కరం కాదు.
Read hindi news : hindi.vaartha.com
Epaper :epapervaartha.com
Read Also: