వారి వృత్తి అడవి పందులను(Bangarupalyam) వేటాడి, జీవనాన్ని సాగిస్తారు. అదే వారికి జీవనోపాధి. అలా ఆ వేటలో ఊహించని పరిణామం సంభవించింది. ఇద్దరు వ్యక్తులు పందుల వేటకు వెళ్లి విద్యుత్ తీగలు తగిలి ప్రాణాలను కోల్పోయారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా(Chittoor District) బంగారుపాళ్యం మండలంలో వేటకు వెళ్లిన ఇద్దరు వేటగాళ్లు విద్యుత్ షాక్ కు గురయ్యారు. బండ్లదొడ్డి గ్రామంలో ఈ ఘటన జరిగింది. విద్యుత్ షాక్ కు గురైన ఇద్దరు మృతి చెందగా.. ప్రమాదానికి గురైనవారు గోవింద్ స్వామి, కుట్టిగా గుర్తించారు పోలీసులు. పదవి పందుల కోసం విద్యుత్తు తీగలను గుర్తు తెలియని వ్యక్తులు అమర్చారు. అడవి జంతువుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు వేటగాళ్ల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి.
Read also: భారత్ విజయంపై పాకిస్థాన్‌లో ఓ కుటుంబం సంబరాలు
ప్రాణాలు తీసిన విద్యుత్ తీగలు
అడవి పందులను(Bangarupalyam) వేటాడేందుకు ఉచ్చుగా అమర్చిన విద్యుత్ తీగలు గోవిందస్వామి, కుట్టి అనే ఇద్దరికి తాకాయి. అడవిలో వేటాడేందుకు వెళ్లి విద్యుత్ తీగ తగలడంతో వారిద్దరు అక్కడిక్కడే మరణించారు. ఇద్దరితోపాటు పంది కూడా మృతి చెందారు. ఆవులు మేపేందుకు వెళ్లిన వారు వారిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం బంగారుపాళ్యం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: