📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Bandh: తెలుగు రాష్ట్రాల్లో అంతగా కనిపించని బంద్ ప్రభావం

Author Icon By Vanipushpa
Updated: July 9, 2025 • 12:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జూలై 9, 2025న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాల మద్దతుతో భారత్ బంద్‌(Bharath Bandh)కు పిలుపు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ(Centrl Govt) విధానాలను నిరసిస్తూ నిర్వహించిన ఈ సమ్మె బ్యాంకింగ్, రవాణా, మైనింగ్, గవర్నమెంట్ సంస్థ సదుపాయాలు వంటి రంగాలను లక్ష్యంగా చేసుకుంది. అయితే, దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో బంద్ ప్రభావం కనిపించినప్పటికీ, తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ(Andhra Pradesh, Telangana)లో పరిస్థితులు మాత్రం ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ప్రజలు తమ నిత్యకార్యాలతో ముందుకు సాగారు. ఆర్టీసీ బస్సులు, రైళ్లు, ఆటో రిక్షాలు, క్యాబ్‌లు యథాతథంగా నడిచాయి. చాలా చోట్ల వ్యాపార సంస్థలు తెరిచే ఉన్నాయి, కానీ కొన్ని చోట్ల పాక్షికంగా మూసి ఉండటం కనిపించింది. విద్యా సంస్థలకు సంబంధించి ఎలాంటి అధికారిక సెలవు ప్రకటనలు జారీ చేయలేదు, అందువల్ల స్కూల్స్, కాలేజీలు సాధారణంగా నడిచాయి.

Bandh: తెలుగు రాష్ట్రాల్లో అంతగా కనిపించని బంద్ ప్రభావం

భారత్ బంద్‌కు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు, సామాజిక సంఘాలు పెద్దగా మద్దతు ఇవ్వకపోవడమే వల్ల ప్రభావం తక్కువగా ఉండటానికి ప్రధాన కారణం అయ్యింది. కొన్ని చోట్ల రైతు సంఘాలు ప్రదర్శనలు నిర్వహించినా, వాటి వల్ల ప్రయాణదారులకి గాని, విద్యార్థులకు గాని పెద్ద అంతరాయం కలగలేదు.

స్కూల్స్, కాలేజీలకు ఎలాంటి సెలవు ప్రకటించలేదు

హైదరాబాద్ లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ బస్సులు, రైళ్లు, ఆటో రిక్షాలు, క్యాబ్‌లు జనాలకి ప్రతిరోజూ లాగానే అందుబాటులో ఉన్నాయి. స్కూల్స్, కాలేజీలకు ఎలాంటి సెలవు ప్రకటించలేదు. విద్యా సంస్థలు మామూలుగానే కొనసాగుతున్నాయి. ఇక బ్యాంకింగ్ రంగంలో మాత్రం కొంతభాగంగా ప్రభావం కనిపించింది. బ్యాంకు ఉద్యోగ సంఘాల మద్దతుతో కొన్నిచోట్ల బ్యాంకులు మూసివేయబడ్డాయి, కానీ ATMs, డిజిటల్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ ఆసక్తికరమైన ప్రకటన చేసింది. భారత మజ్దూర్ సంఘ్ (BMS) వంటి ప్రధాన కార్మిక సంఘాలు బంద్‌కు మద్దతు ఇవ్వలేదని వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలను పెద్దగా ప్రభావితం చేయలేదు

అయితే, మిగిలిన కేంద్ర కార్మిక సంఘాలు దీనిని ఖండించాయి, తమ పూర్తి మద్దతు బంద్‌కు ఉందని స్పష్టం చేశాయి. మొత్తంగా చూస్తే, జాతీయ స్థాయిలో జరిపిన ఈ బంద్ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలను పెద్దగా ప్రభావితం చేయలేదు. ప్రజలు సాధారణంగా తమ పనులకు వెళ్లారు, విద్యార్థులు తరగతులకు హాజరయ్యారు, రవాణా కూడా సజావుగానే సాగుతుంది. ఇది రాష్ట్ర ప్రజల్లో బంద్‌పై స్పష్టమైన అవగాహన, అలాగే ప్రభుత్వం తీసుకున్న సమర్థ చర్యల ఫలితం అని చెప్పవచ్చు .

భారత్ బంద్ అంటే ఏమిటి?
భారత్ బంద్: అధికారిక మరియు అనధికారిక రంగాలకు చెందిన కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. బ్యాంకింగ్, పోస్టల్ సేవలు, మైనింగ్, నిర్మాణం మరియు రవాణా వంటి ప్రభుత్వ రంగాలకు చెందిన 25 కోట్లకు పైగా కార్మికులు బుధవారం దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె లేదా భారత్ బంద్‌లో పాల్గొంటారు.
భారతదేశంలో బంద్ చట్టవిరుద్ధమా?
పాలిచా వర్సెస్ కేరళ రాష్ట్రం (1997): బంద్‌లు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించబడ్డాయి, వాటి బలవంతపు స్వభావాన్ని మరియు ఉద్యమ స్వేచ్ఛ మరియు వాణిజ్య హక్కు వంటి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడాన్ని నొక్కి చెప్పాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Electric vehicles: విద్యుత్ వాహనాల విక్రయాలు జంప్

#telugu News Andhra Pradesh Bandh Bandh in Telugu States Telangana Bandh

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.