Bandaru Shravani: మహిళా ఎమ్మెల్యే ఇంటి వద్ద క్షుద్రపూజలు

Read Time:  1 min
Bandaru Shravani: మహిళా ఎమ్మెల్యే ఇంటి వద్ద క్షుద్రపూజలు
FONT SIZE
GET APP

Bandaru Shravani: శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి నివాసం వద్ద జరిగిన అనుమానాస్పద ఘటన కలకలం రేపింది. ఓ కారులో వచ్చిన కొందరు వ్యక్తులు ఆమె ఇంటి ముందుగా నిమ్మకాయలు, తెల్ల నువ్వులు పడేసి వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఇటీవలి కాలంలో ఇలాంటి సంఘటనలు వరుసగా జరుగుతుండటంతో ఎమ్మెల్యే కుటుంబం భయాందోళనల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also: Vizianagaram Library: గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా డొంకాడ రామకృష్ణ.

Bandaru Shravani: Occult rituals at the house of a female MLA
Bandaru Shravani: Occult rituals at the house of a female MLA

తాజాగా స్విఫ్ట్ కారులో వచ్చిన వ్యక్తులు ఎమ్మెల్యే ఇంటి ఎదుట ఈ విధంగా చేయడాన్ని గమనించిన ఆమె అనుచరులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఆ కారు అతివేగంతో అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లింది. వాహనానికి ఏపీ 39 కేఎక్స్ 0986 నంబర్ ఉన్నట్లు గుర్తించారు.

రాజకీయ కుట్ర అనుమానం

గత కొన్ని నెలలుగా తమ నివాసం వద్ద ఇదే తరహా ఘటనలు పునరావృతమవుతున్నాయని ఎమ్మెల్యే శ్రావణి అనుమానం వ్యక్తం చేశారు. ఈ కారణంగా కుటుంబ సభ్యులు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. ఈ ఘటనల వెనుక శింగనమల నియోజకవర్గానికి చెందిన ఓ అసమ్మతి నేత ప్రమేయం ఉండొచ్చని ఆమె వర్గీయులు అనుమానిస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేని వారు ఇలాంటి తంత్రాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

ఈ ఘటనపై ఎమ్మెల్యే అనుచరులు చేసిన ఫిర్యాదు మేరకు అనంతపురం టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కారు నంబర్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.