హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ఆయన అభిమానుల్లో ఒకరు అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసిన వెంటనే సాయం అందించేందుకు ప్రత్యేకంగా ముందుకొచ్చారు.కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన బద్రిస్వామి అనే అభిమాని గత కొన్ని నెలలుగా కాలేయ వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడు. వైద్యుల ప్రకారం అతని చికిత్సకు దాదాపు రూ.20 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా అతని కుటుంబం చికిత్స చేయించుకోలేకపోయింది.
అభిమాన సంఘం ద్వారా బాలయ్య దృష్టికి సమాచారం
ఈ విషయం ఆదోని నందమూరి అభిమాన సంఘం అధ్యక్షుడు సజ్జాదాస్సేన్ ద్వారా బాలయ్య దృష్టికి చేరింది. సమస్యను తెలుసుకున్న వెంటనే బాలయ్య స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రూ.10 లక్షల ఎల్ఓసీ మంజూరు (Rs. 10 lakh LOC sanctioned) అయ్యేలా చర్యలు తీసుకున్నారు.
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
మంజూరైన ఎల్ఓసీ పత్రాన్ని బాలయ్య సతీమణి వసుంధర నిన్న బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సాయం కుటుంబానికి పెద్ద ఊరట కలిగించింది.
అభిమానుల కృతజ్ఞతలు
అనారోగ్యంతో ఉన్న అభిమానికి అండగా నిలిచి సాయం చేసిన బాలయ్యకు అభిమానులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో ఎప్పుడూ ముందుంటూ సహాయం అందించే బాలయ్యను అభిమానులు మరోసారి ప్రశంసించారు.
Read Also : Chandrababu : డ్రోన్ క్షిపణి పరీక్ష విజయవంతంపై చంద్రబాబు హర్షం