📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Online Cricket Betting Arrest: ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో టోకరా.. ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు

Author Icon By Siva Prasad
Updated: February 21, 2026 • 12:12 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Online Cricket Betting Arrest: అధిక లాభాలు వస్తాయనే ఆశ చూపి ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న భారీ కేటుగాళ్ల గుట్టును బాలాజీ నగర్ పోలీసులు రట్టు చేశారు. స్థానిక ఎన్టీఆర్ నగర్‌కు చెందిన ఓ బాధితుడిని బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన వేణు అనే వ్యక్తి పరిచయం చేసుకుని, సుమారు రూ. 53 లక్షలు ఇన్వెస్ట్ చేయించాడు. నగదు తిరిగి ఇవ్వకపోగా, బాధితుడిని బెదిరించడంతో పోలీసులకు ఫిర్యాదు అందింది. రంగంలోకి దిగిన పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టి అసలు విషయాలను వెలుగులోకి తెచ్చారు.

Read Also: Chandrababu : ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ గా చంద్రబాబే ఉండాల్సింది – భూమన ఎద్దేవా

బెట్టింగ్ యాప్ ద్వారా అక్రమ దందా

జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు బాలాజీ నగర్ సీఐ సాంబశివరావు బృందం బుచ్చిరెడ్డిపాలెంలో తనిఖీలు నిర్వహించింది. నిందితులు కూసెట్టి వేణు, బిట్ర వెంకటరమణలు ‘R777.US’ అనే లింక్ ద్వారా ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. వీరు కేవలం ఇన్వెస్ట్‌మెంట్ మోసాలే కాకుండా, అక్రమ బెట్టింగ్ నిర్వహిస్తూ, ఎవరైనా గొడవకు వస్తే కత్తులతో భయపెడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వీరి వద్ద నుండి రూ. 34,65,800 నగదు, ల్యాప్‌టాప్, టీవీ మరియు రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు.

Online Cricket Betting Arrest: భారీ మొత్తంలో బ్యాంక్ బ్యాలెన్స్ ఫ్రీజ్

ముద్దాయిల బ్యాంక్ ఖాతాలను పరిశీలించిన పోలీసులు షాక్‌కు గురయ్యారు. వారి ఖాతాలో ఉన్న రూ. 1,64,74,600 నగదును తక్షణమే ఫ్రీజ్ చేయించారు. ఈ కేసులో మరికొందరు ఆర్గనైజర్లు ఉన్నట్లు గుర్తించామని, వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్పీ తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ప్రతిభ కనబరిచిన సీఐ సాంబశివరావు, ఎస్ఐ విజయ్ శ్రీనివాస్ మరియు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి

అధిక లాభాల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్, వ్యక్తులను నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దు” అని ఎస్పీ అజిత వేజెండ్ల హితవు పలికారు. క్రికెట్ బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇలాంటి మోసాల గురించి సమాచారం ఉంటే వెంటనే ‘డయల్ 112’ కు తెలియజేయాలని కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Balaji Nagar Police Bank Account Freeze Case Buchireddypalem Crime News Investment Scam Nellore Police News Online Cricket Betting Arrest R777 US Betting Link SP Ajitha Vejendla IPS

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.