📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

B Saroja Devi: సరోజాదేవి మృతిపై సంతాపం తెలిపిన చంద్రబాబు, పవన్ కల్యాణ్

Author Icon By Sharanya
Updated: July 14, 2025 • 2:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రముఖ సినీ నటి బి. సరోజాదేవి (87) (B Saroja Devi) 2025 జూలై 14న బెంగుళూరులోని తన నివాసంలో వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో తుదిశ్వాస (Death due to illness)విడిచారు. ఈ వార్త తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రసీమలలో తీవ్ర విషాదాన్ని నింపింది. సహజ అభినయం, మనోహర రూపం, నటనా ప్రతిభతో దక్షిణ భారత సినీ రంగంలో తొలి మహిళా సూపర్‌స్టార్గా గుర్తింపు పొందిన ఆమె, దాదాపు 200 పైగా చిత్రాలలో నటించారు.

సరోజాదేవి మరణ వార్తపై పలువురు ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) , ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా తన తీవ్ర విషాదాన్ని వ్యక్తం చేశారు.

సీఎం చంద్రబాబు సంతాపం:

ప్రముఖ నటి బి. సరోజాదేవి (B Saroja Devi) బెంగుళూరులో తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర విచారం కలిగింది. తెలుగు, తమిళ, కన్నడ భాషా చిత్రాలలో కథానాయకిగా ఆమె అనేక ప్రశంసలు అందుకున్నారు. మహా నటులు ఎన్టీఆర్, ఏఎన్నార్‌తో కలిసి ఎన్నో చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను” అంటూ సీఎం చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందించారు.

ఉప సీఎం పవన్ కల్యాణ్ స్పందన:

పవన్ కూడా సోషల్ మీడియా ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు.”ప్రముఖ నటి బి.సరోజాదేవి గారు కన్నుమూశారని తెలిసి బాధపడ్డాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. 1955 నుంచి దాదాపు మూడు దశాబ్దాలపాటు తెలుగు, కన్నడ, తమిళ భాషా చిత్రాల్లో నటించి చిత్ర సీమపై తనదైన ముద్రను వేశారు. భూకైలాస్, పాండురంగ మహత్యం, సీతారామ కళ్యాణం, జగదేకవీరుని కథ, శకుంతల, దానవీర శూర కర్ణ, ఆత్మబలం లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. బి.సరోజా దేవి గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను” అని పేర్కొన్నారు.

పురస్కారాలు

వ్యక్తిగత జీవితం

1967లో శ్రీహర్షను వివాహం చేసుకున్న సరోజాదేవి, భర్త 1986లో మృతిచెందిన తర్వాత కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చారు. అనంతరం మళ్లీ నటన కొనసాగించారు. ఆమె స్థాపించిన భువనేశ్వరి ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టారు .

Read hindi news: hindi.vaartha.com

Read also: Santhosham Movie: సంతోషం (ఈటీవీ విన్) మూవీ రివ్యూ

Breaking News BSarojaDevi ChandrababuNaidu IndianCinemaLegend latest news padmabhushan PawanKalyan RIPBSarojaDevi Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.