📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News Telugu: Ayyannapatrudu: స్పీకర్ అయ్యన్నకు అరుదైన గౌరవం

Author Icon By Rajitha
Updated: October 11, 2025 • 12:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బార్బడోస్ పార్లమెంటు (Parliament_of_Barbados) స్పీకర్ స్థానంలో ఆశీనులైన అయ్యన్న Ayyannapatrudu విజయవాడ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు బార్బడోస్లో పర్యటించారు. గురువారం ఆయన బార్బడోస్ పార్లమెంట్ను సందర్శించారు. ఈ సందర్భంగా, ప్రత్యేక ఆహ్వానం మేరకు బార్బడోస్ పార్లమెంట్ దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ అసెంబ్లీ స్పీకర్ స్థానంలో అయ్యన్నపాత్రుడు ఆసీనులయ్యారు. ఈ స్పీకర్ కుర్చీకి భారతదేశంతో ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. 1966లో బార్బడోస్ స్వాతంత్రం పొందినప్పుడు, అప్పటి భారత ప్రభుత్వం బహుమతిగా, అందంగా చెక్కిన ఈ స్పీకర్ కుర్చీని బార్బడోస్కు అందించింది. ఇకభారత ప్రజాస్వామ్య వ్యవస్థ అత్యంత పటిష్టమైనదని, ప్రజలే ఇక్కడ సార్వభౌములని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. బార్బడోస్లోని బ్రిడ్జన్లో జరుగుతున్న 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులో భాగంగా గురువారం జరిగిన “పార్లమెంటరీ స్కృటినీ ఫర్ ఇంప్రూవ్డ్ డెమోక్రసీ” అనే అంశంపై ఆయన కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, 75 సంవత్సరాలుగా భారతదేశం ఒక గణతంత్ర రాజ్యంగా విజయవంతంగా కొనసాగడంలో పార్లమెంట్, (parlement) రాష్ట్ర శాసనసభల పాత్ర ఎంతో కీలకమని అన్నారు.

Bapatla Crime: ఘోరం.. పొట్టిగా ఉన్నాడని బావను హతమార్చిన బావమరిది

“ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే పాలకులు” అనే స్ఫూర్తితో రూపొందించబడిన భారత రాజ్యాంగమే మన ప్రజాస్వామ్యానికి పునాది అని ఆయన పేర్కొన్నారు. భారత ఎన్నికల వ్యవస్థ గొప్పతనాన్ని వివరిస్తూ, “దేశంలో జరిగిన 18వ లోక్ సభ (Lok_Sabha) ఎన్నికల్లో సుమారు 97 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత 18 సార్వత్రిక ఎన్నికలలో దేశ ప్రజలు 8 సార్లు ప్రభుత్వాలను శాంతియుతంగా మార్చారు. ఇది భారత ఓటరుకున్న శక్తికి, ప్రజాస్వామ్య వ్యవస్థపై వారికున్న నమ్మకానికి నిదర్శనం” అని స్పీకర్అన్నారు. Ayyannapatrudu భారత రాజ్యాంగం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మార్పులకు లోనవుతూ, వందకు పైగా సవరణలతో మరింత పరిణతి చెందిందని తెలిపారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు తమ పరిధిలో పనిచేస్తూ రాజ్యాంగ ఆధిక్యతను గౌరవిస్తాయని, ప్రజలే నిజమైన యజమానులని స్పష్టం చేశారు. తన ప్రసంగంలో దివంగత నేత నందమూరి తారక రామారావు చెప్పిన “ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం” అనేమాటలను, మహాత్మా గాంధీ చెప్పిన ప్రజాస్వామ్య సూక్తులను స్పీకర్ ఉటంకించారు. ప్రజాప్రతినిధులు తమఆస్తులు, అప్పులను స్వచ్ఛందంగా ప్రకటించే పద్ధతిని తప్పని సరిచేయాలని ఆయన సూచించారు. ఈ సదస్సులో వివిధ దేశాల ప్రతినిధులు, స్పీకర్లు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Barbados Parliament Chintakayala Ayyannapatrudu Commonwealth Parliamentary Conference latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.