Ayesha Meera Case: కన్నీళ్లు పెట్టుకున్న ఆయేషా మీరా తల్లి

Read Time:  1 min
Ayesha Meera Case: కన్నీళ్లు పెట్టుకున్న ఆయేషా మీరా తల్లి
FONT SIZE
GET APP
Ayesha Meera Case: Ayesha Meera's mother in tears
Ayesha Meera Case: Ayesha Meera’s mother in tears

Ayesha Meera Case: దశాబ్దాలు గడుస్తున్నా ఆయేషా మీరా హత్య కేసులో న్యాయం అందకపోవడంపై ఆమె తల్లి షంషాద్ బేగం తీవ్ర ఆగ్రహం మరియు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం విజయవాడలోని సీబీఐ కోర్టు ప్రాంగణానికి చేరుకున్న ఆమె, కేసు విచారణలో జరుగుతున్న జాప్యంపై మీడియాతో మాట్లాడారు.

Read Also: Velugumatla House Collapse : కాంగ్రెస్ కూలగొట్టిన చోటే..ఇళ్లు కట్టిస్తాం – కేటీఆర్

ఆధారాల తారుమారుపై ఆరోపణలు

తమ కూతురిని పొట్టనబెట్టుకున్న అసలు నిందితులను రక్షించేందుకు మొదటి నుంచీ ఆధారాలను తారుమారు చేశారని ఆమె ఆరోపించారు. అత్యున్నత దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగినా, చివరకు సీబీఐ కోర్టు కూడా ఆధారాలు లేవని పేర్కొనడం తమను ఎంతగానో కలచివేసిందని కన్నీటి పర్యంతమయ్యారు. “న్యాయస్థానాలే చేతులెత్తేస్తే మాకు దిక్కెవరు?” అని ఆమె ప్రశ్నించారు.

పోరాటం ఆగదు:

ఎన్ని అడ్డంకులు ఎదురైనా, తమ బిడ్డను చంపిన వారికి కఠిన శిక్ష పడే వరకు న్యాయపోరాటాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఆయేషా తల్లిదండ్రులు స్పష్టం చేశారు. న్యాయం కోసం తాము పడుతున్న గోసను చూసైనా ప్రభుత్వం, కోర్టులు స్పందించాలని వారు కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.