ప్రపంచంలో నేడే జన్మించిన శిశువు నుంచి పండుముసలి వరకు ప్రతి ఒక్కరు వినియోగదారుడే. వినియోగదారుడే వ్యాపారానికి కేంద్ర బిందువు. నేటి డిజిటల్ యుగంలో ఈవ్యాపారాలుపెరుగుతున్న వేళ వినియోగదారులు అప్రమత్తంగా ఉండవల్సిన అగత్యం ఏర్పడింది. ఒక వస్తువును కొన్నప్పుడు లేదా అమ్మినప్పుడు సరైన న్యాయం పొందడం కనీస అవసరం. 1960ల నుంచే వినియోగదారుల చైతన్య ఉద్యమాలు ప్రారంభం కావడం, దినదినం తీవ్ర రూపం దాల్చడం, వినియోగదారుల మండలి/ఫోరంలు ఏర్పడడం, వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టాలు (Consumer Laws)
రావడం గమ నిస్తున్నాం. వినియోగదారులకు చట్టం (Consumer Laws) కొన్ని నిర్దిష్టమైన హక్కులను కల్పించింది. సంరక్షణ హక్కు (రైట్ టు సేఫ్టీ), సమాచార హక్కు (రైట్ టు ఇన్ఫర్మేషన్), ఎంపిక హక్కు (రైట్ఛూజ్), వివరణ పొందే హక్కు(రైట్ టు బి హర్డ్), ఫిర్యాదుల పరిష్కార హక్కు(రైట్ టు సీక్ రిడ్రెస్సల్), విని యోగదారుల విద్యాహక్కు(రైట్ టు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్) అనబడే ఆరు హకు్కలను భారత వినియోగ దారుల పరి రక్షణ చట్టం, 1986 కల్పించడం హర్షదాయకం. వినియోగ దారులకు సంబంధించిన అతి ముఖ్యమైన ఈ చట్టం 24 డిసెంబర్ 1986న పార్లమెంట్ ద్వారా చేయబడిన సంద ర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా 24 డిసెంబర్ న దేశ వ్యాప్తంగా జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం (నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డే)” పాటించుట ఆనవాయితీగా మారింది. జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం2025 ఇతివృత్తంగా సుస్థిర జీవనశైలి వైపు అడుగులు (ఏ జెస్ట్ ట్రాన్సిషన్ టు సస్టైనబుల్ లైఫ్ స్టైల్స్)” అనబడే అంశాన్ని తీసుకొని ప్రచారం చేయడం జరుగుతోంది. వినియోగ దారుల దోపిడీ, స్వార్థపరమైన వ్యాపారుల అనైతిక విక్రయ పద్ధతులు, వినియోగదారుల అభిరుచులను తమకు అనుకూలంగా మార్చుకోవడం, మోసపోయిన వినియోగదారులకు తిరిగి న్యాయం అందించడం, జరిగిన నష్టానికి అసౌకర్యా నికి పరిహారం పొందడం, అనారోగ్యకర వ్యాపార పద్ధతు లను అరికట్టడం, అవసర మైనప్పుడు వినియోగదారుల ఫోరం/మండలిని ఆశ్రయించడం లాంటి వెసులుబాట్లను వినియోగదారులకు చట్టం కల్పించడం ముదావహం.
Read Also: http://Online Shopping: ఆన్లైన్ కొనుగోళ్లలో విజయవాడ ముందంజ

జాతీయ వినియోగదారుల హక్కులదినం వేదికగాపలు ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు విద్యాలయాలు, పౌర సమాజంలో వినియోగదారుల హక్కుల పట్ల కార్యశాలలు /సెమినార్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. విని యోగదారులహక్కులకు భంగం కలిగినప్పుడు మూడు అంచెల వ్యవస్థ కలిగిన పరిహార మార్గాలను చట్టం కల్పిం చింది. పరిహార విలువ ఒక కోటి రూపాయల లోపు ఉన్న ప్పుడు జిల్లాస్థాయివినియోగదారుల వివాదాల పరిహార కమీషన్కు ఫిర్యాదు చేయడం, రూ: 1 నుంచి రూ. 10 కోట్ల వరకు రాష్ట్ర వినియోగదారుల వివాదాలు పరిహార కమీషను, రూ.10 కోట్లు దాటితే జాతీయవినియోగదా రుల వివాదాల పరిహార కమీషన్కు ఫిర్యాదులు చేసి ఉచి తంగా న్యాయం పొందవచ్చు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం, 1986 తర్వాత కొన్ని సవరణలతో మరో
వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం, 2019ని తీసు కురావడంతో వినియోగదారుడికి న్యాయం జరగడానికి చట్టమే ఒక పదునైన ఆయుధంగా అందించడం జరిగింది. ఐరాస కూడా ప్రతి ఏటా మార్చి నెలలో ప్రపంచ వినియోగ దారుల హక్కుల దినం పాటించుట కొనసాగుతున్న విష యం మనకు తెలుసు. ప్రతీ పౌరుడు ఒక వినియోగదారు డిగా తమ హక్కులను తెలుసుకొని, మోసపోకుండా, న్యాయబద్ధమైన సేవలను పొందడానికి అవసరమైన కనీస వినియోగదారుల అవగాహనను కలిగి ఉండాలి. మనల్ని మనమే చట్టం ద్వారా రక్షణ పొందుతూ అనైతిక వ్యాపారపోకడలకు అడ్డుకట్ట వేయాలి. వినియోగదారుల చైతన్య ఉద్యమాల ద్వారా సామాన్య జనాలకు వినియోగదారుల హక్కుల గూర్చి అవగాహన కల్పించాలి. వినియోగదారుడిని మన చట్టాలు శక్తివంతం చేసాయని, వాటి నీడన సురక్షి తంగా జీవనయానం సాగించాలని కోరుకుందాం. అడుగ డుగున అప్రమత్తతతో ఉందాం. నైతికత గీత దాటిన వ్యాపారవేత్తలకు లేదా కంపెనీలకు లేదా సేవలకు చట్ట తీవ్రతను పరిచయం చేద్దాం.
-ఆచార్య బుర్ర మధుసూదన్ రెడ్డి
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: