📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Today News : Disaster Management – విపత్తు నిర్వహణలో కీలకంగా అవేర్ 2.0 వ్యవస్థ

Author Icon By Shravan
Updated: August 22, 2025 • 3:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ Disaster Management : ప్రకృతి వైపరీత్యాల సంభవించిన సందర్భంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వూర్తి స్థాయిలో వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు (CM Chandrababu Naidu) ఉద్ఘాటించారు. వాతావరణ ముందస్తు అంచనాలు, విపత్తు నిర్వహణ, నదులు, జలాశయాల్లో నీటి నిల్వలపై పర్యవేక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తోంది. ఆవేర్ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలోని వివిధ అంశాల్లో ముందస్తు సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వం మరిన్ని రంగాలను కూడా ఈ వ్యవస్థకిందకు తీసుకువస్తూ నిర్ణయం తీసుకుంది. వాతావరణంతో పాటు రాష్ట్రంలోని నదులు, జలాశయాల్లో నీటి నిల్వలు, సాయిల్ మాయిశ్చర్, గాలి నాణ్యత, కాలుష్యం, భూగర్భవేర్వేరు అంశాలను జలాలు ఇలా పర్యవేక్షించేలా, ప్రజలకు వేగంగా సమాచారాన్ని అందించేలా అవేర్ 2.0ను రూపోందించింది. భారీ వర్షాలు, పిడుగులు, తుపాన్లు, తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు లాంటి వాతావరణ అంశాలపై ముందస్తు సమాచారాన్ని సేకరించి అప్రమత్తం చేయటం ద్వారా ప్రజల ప్రాణాలను, ఆస్తిని కాపాడేలా వ్యవస్థ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ మేరకు ఏపీ వెదర్ ఫోర్ కాస్టింగ్ అండ్ ఎర్లీ వార్నింగ్ రీసెర్చ్ సెంటర్ అవేర్ 2.0 వ్యవస్థను ఆర్టీజీఎస్ ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థ ద్వారా వర్షాలు, వరదలు, పిడుగులు, గాలివానలు, జలాశయాల నీటి స్థాయిలు, నదుల ప్రవాహాలపై ముందస్తు అంచనాలు ఇచ్చి వివత్తు నిర్వహణలో కీలక సమాచారాన్ని ముందుగానే అందుబాటులోకి రానుంది. వాతావరణంలో వచ్చే మార్పులను 7
రోజుల ముందుగానే అవేర్ 2.0 (Aware 2.0) వ్యవస్థ పసిగట్టి హెచ్చరికలు జారీ చేయనుంది.

Disaster Management – విపత్తు నిర్వహణలో కీలకంగా అవేర్ 2.0 వ్యవస్థ

అవేర్ 2.0 తో విపత్తుల ముందస్తు హెచ్చరికలు, ప్రాణ రక్షణ

ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై ప్రజల ప్రాణాల్ని, ఆస్తుల్ని, మూగజీవాలను కాపాడేందుకు ఆస్కారం ఏర్పడింది. ఆవేర్ 2.0 తో ప్రకృతి విపత్తుల వల్ల కలిగే ప్రాణ, ఆస్తి నష్టాలను చాలా వరకు తగ్గించే అవకాశం కలుగుతుందని ఆర్టీజీఎస్ చెబుతోంది. కొత్త వ్యవస్థతో పూర్తిగా మరణాలను నివారించేందుకు ఆస్కారం ఏర్పడిందని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అవేర్ 2.0 ద్వారా వారం రోజుల ముందుగానే వర్షపాతం, గాలి వేగం, మెరువులు, పిడుగుపాటుపై ఖచ్చితమైన అంచనాలు లభిస్తున్నాయని ఆర్టీజీఎస్ వెల్లడించింది. ఈ సమాచారం ఆధారంగా రైతులు వంటల నిర్వహణ, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకుండా ముందస్తుగా హెచ్చరికలు జారీ చేయొచ్చని అధికారులు చెబుతున్నారు. తుపాన్లకు సంబంధించి ముందస్తు సమాచారం లేకపోవటంతో మత్స్యకారులు సముద్రంలో చిక్కుకుంటున్న పరిస్థితులు నెలకొంటున్నాయని ఈ కారణంగా వారి విలువైన ప్రాణాలు కోల్పోవటం లేదా పొరుగుదేశాల సరిహద్దుల్లోకి వెళ్తున్న ఘటనలు నమోదు అవుతున్నట్టు ఆర్టీజీఎస్ తెలిపింది. ప్రస్తుతం అవేర్ -2.0 వ్యవస్థతో సముద్రంలో జరిగే ప్రమాదాలను నివారించవచ్చని స్పష్టం చేసింది. మరోవైపు రాష్ట్రంలోని 109 జలాశయాలు, కృష్ణా-గోదావరి వంటి ప్రధాన నదులపై రియల్ టైమ్ మానిటరింగ్ ను కూడా చేస్తున్నట్టు ఆర్టీజీఎస్ తెలిపింది. రిజర్వాయర్లలో నీటి నిల్వలు, ప్రవాహాలపై కూడా అవేర్ తో తక్షణం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/plans-to-modernize-the-kalyanakatta-in-tirumala/andhra-pradesh/534418/

Andhra Pradesh Disaster Control Aware 2.0 System Aware App Updates Breaking News in Telugu Disaster Management India Latest News in Telugu Telugu News Paper

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.