📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Auto Drivers in AP: ఆగస్ట్ 15 న తేదీన ఆటోడ్రైవర్లకు ఆర్థిక సాయం?

Author Icon By Anusha
Updated: July 27, 2025 • 4:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేయబోతున్న నేపథ్యంలో, తమ ఉపాధిపై ప్రభావం పడుతుందనే ఆందోళనలో ఉన్న ఆటోడ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటన చేయగా, తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Atchannaidu) ఈ విషయాన్ని మరింత స్పష్టం చేశారు.ఆగస్ట్ 15న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు. ఇదే రోజున ఆటోడ్రైవర్లకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని కూడా ప్రకటించే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం ఆటోడ్రైవర్లలో ఆనందాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే, రాష్ట్రంలోని అనేక మంది డ్రైవర్లు తమ జీవనాధారం పూర్తిగా ఆటోపై ఆధారపడి ఉంది. మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించడం వల్ల వారి ప్రయాణ అవసరాలు ఆర్టీసీ వైపు మళ్లిపోయే అవకాశం ఉంది.

ఉచిత బస్సు

ఈ నేపథ్యంలో తమ ఆదాయం తగ్గిపోతుందనే భయం ఆటో డ్రైవర్లలో నెలకొంది.మరోవైపు ఏపీలోనూ రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయనున్నారు. ఐదు రకాల బస్సు సర్వీసులలో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, సిటీ ఎక్స్‌ప్రెస్ వంటి బస్సులలో ఉచిత బస్సు ప్రయాణ (Free bus travel) సదుపాయం అమలుచేసే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది.ఈ సందర్భంగా మహిళలకు జీరో ఫేర్ టికెట్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే రవాణాశాఖ అధికారులకు సూచించారు. అందులో ప్రయాణం వివరాలు, పథకంతో ఆదా అయిన డబ్బుల వివరాలు వంటవి పొందుపరచాలని సూచించారు. మొత్తంగా ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఉచిత బస్సు ప్రయాణం పథకం ఆగస్టు 15 నుంచి ఏపీలోని మహిళలకు అందుబాటులోకి రానుంది.

చంద్రబాబు నాయుడు చరిత్ర?

నాయుడు 1989 నుండి 1995 వరకు టిడిపి శాసనసభ సభ్యుడిగా (ఎమ్మెల్యే) పనిచేశారు. 1995 లో, ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రిగా గతంలో రెండు పర్యాయాలు పనిచేసిన కాలంలో, నాయుడు ప్రజలలో ఒక దార్శనిక ఆర్థిక సంస్కర్త, సమాచార సాంకేతికత ఆధారిత ఆర్థిక వృద్ధికి ప్రతిపాదకుడిగా గుర్తింపు పొందారు.

చంద్రబాబు నాయుడు కంపెనీ ఏది?

హెరిటేజ్ గ్రూప్‌ను 1992లో తెలుగుదేశం పార్టీ అధినేత మరియు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు స్థాపించారు, దాని ప్రధాన కంపెనీ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ (HFL) కింద డెయిరీ, రిటైల్ మరియు వ్యవసాయం అనే మూడు వ్యాపార విభాగాలు, ఒక మౌలిక సదుపాయాల అనుబంధ సంస్థ – హెరిటేజ్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read also: Andhra Pradesh: జిల్లాల పునర్విభజన అంశం మళ్లీ తెరపైకి

Achchennaidu Andhra Pradesh AP auto drivers support AP government aid auto drivers scheme Breaking News Chandrababu Naidu financial assistance AP free bus travel women latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.