AU Students Protest: విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం మరోసారి నిరసనలతో అట్టుడికింది. ఏబీవీపీ (ABVP) పిలుపునిచ్చిన ‘ఏయూ ముట్టడి’ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వర్సిటీ ముఖద్వారం వద్ద విద్యార్థి నేతలకు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి అదుపు తప్పింది.
Read Also: Ambati Rambabu: రాంబాబుతో పాటు వైసీపీ నేతలపై మరో కేసు
ఘటనకు గల కారణాలు
ఎస్‌ఎఫ్‌ఐ (SFI), ఏఐఎస్‌ఎఫ్ (AISF) నాయకులు బీసీ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారని ఆరోపిస్తూ ఏబీవీపీ ఈ నిరసన చేపట్టింది. బీసీ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్న సదరు విద్యార్థి సంఘాల నేతలను వెంటనే అరెస్టు చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది.
Students Protest: పోలీసుల మోహరింపు – అరెస్టులు
ఏబీవీపీ నేతలు భారీ సంఖ్యలో యూనివర్సిటీ గేటు వద్దకు చేరుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని సమీప పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ ఘటనతో ఏయూ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: